Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఉక్రెయిన్ లో కీలక నగరాన్ని కోల్పోయిన రష్యా!

ఉక్రెయిన్ లో కీలక నగరాన్ని కోల్పోయిన రష్యా!

  • ఉక్రెయిన్ పై యుద్ధంలో రష్యాకు ఎదురు దెబ్బ
  • ఖార్ఖివ్ ప్రావిన్స్ లోని ఇజియంను చేజిక్కించుకున్న ఉక్రెయిన్
  • ఉక్రెయిన్ పై యుద్ధంలో దీన్ని కీలక మలుపుగా భావిస్తున్న నిపుణులు

ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు ఏడు నెలలు గడిచిపోతోంది. యుద్ధం ప్రారంభమైన తర్వాత ప్రపంచం మొత్తం ఈ యుద్ధంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అయితే కాలక్రమేణా ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు సరికొత్త పరిణామాలు సంభవిస్తూ పోతుండటంతో… ఈ విషయంపై జనాలకు ఆసక్తి సన్నగిల్లింది. తాజాగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధం విషయానికి వస్తే… ఈ యుద్ధంలో రష్యాకు చిన్న ఎదురుదెబ్బ తగిలింది.

ఖార్ఖివ్ ప్రావిన్స్ లోని ఇజియంను ఉక్రెయిన్ కు రష్యా కోల్పోయింది. ఇది రష్యాకు ఎదురు దెబ్బేనని నిపుణులు అంటున్నారు. ఈ ప్రాంతంలో రష్యా బలగాలు గత కొన్ని నెలలుగా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. ఈ ప్రాంతంపై ఉక్రెయిన్ ఆధిపత్యాన్ని సాధించడం కీలక మలుపుగా భావిస్తున్నారు. మరోవైపు, తమ లక్ష్యం నెరవేరేంత వరకు ఉక్రెయిన్ పై తమ దాడి కొనసాగుతుందని ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంగా చెప్పడం గమనార్హం.

Related posts

మనవరాలికి జన్మనిచ్చిన నాయనమ్మ… సరోగసీలో కొత్త కోణం!

Drukpadam

తెలంగాణ‌లో మూడు కార్పొరేష‌న్ల‌కు చైర్మ‌న్ల‌ నియామకం

Drukpadam

మార్చ్, ఏప్రిల్ మాసాల్లో ప్రాంతీయ సదస్సులు-టీయూడబ్ల్యూజే నేత విరాహత్ అలీ

Drukpadam

Leave a Comment