Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ ..గోవా లో పార్టీని వీడిన 8 మంది ఎమ్మెల్యేలు!

కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ ..గోవా లో పార్టీని వీడిన 8 మంది ఎమ్మెల్యేలు!
-గోవా సీఎం ప్రమోద్ సావంత్ సమక్షంలో బీజేపీలో చేరిక
-గోవాలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ
-పార్టీని వీడిన 8 మంది ఎమ్మెల్యేలు
-వారిలో మాజీ సీఎం దిగంబర్ కామత్ ఒకరు
-అదేబాటలో సీఎల్పీ నేత మైఖేల్ లోబో

ఇప్పటికే 11 రాష్ట్రాల్లో ప్రతిపక్ష సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న బీజేపీ గోవా లోను కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ కొట్టింది. కాంగ్రెస్ కు ఉన్న 11 మంది ఎమ్మెల్యేలలో 8 మంది ఒకేసారి పార్టీని వీడి బీజేపీ లో చేరడం కాంగ్రెస్ పార్టీని అక్కడ కోలుకోకుండ చేసింది. మొన్నటి ఎన్నికల్లో అధికారంలోకి వస్తుందని భావించిన కాంగ్రెస్ ను ఒక ఆప్ , మరో పక్క మమతా బెనర్జీ టీఎంసీ పార్టీలు దెబ్బతిశాయి. ఇప్పుడు గెలిచినా సభ్యుల్లో మాజీ సీఎం , కాంగ్రెస్ పక్ష నేత కూడా ఉండటం విశేషం ..

గోవాలో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 8 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నేడు కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ సమక్షంలో వారు కాషాయ కండువాలు కప్పుకున్నారు.

బీజేపీలో చేరిన వారిలో మాజీ సీఎ దిగంబర్ కామత్, సీఎల్పీ నేత మైఖేల్ లోబో కూడా ఉన్నారు. వారితో పాటే డెలిలా లోబో, రాజేశ్ ఫల్ దేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోంకర్, అలెక్సియో సీక్వియేరా, రుడాల్ఫ్ ఫెర్నాండెజ్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.

సీఎల్పీ నేత మైఖేల్ లోబో ఇవాళ ఉదయం కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీని బీజేపీలో విలీనం చేసేలా తీర్మానం చేశారు. ఈ తీర్మానాన్ని లేఖ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి సమర్పించారు. అనంతరం సీఎం సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ పరిణామంతో ప్రస్తుతం కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు మిగిలారు. అటు, గోవా అసెంబ్లీలో బీజేపీ సొంత బలం 20 నుంచి 28కి పెరిగింది.

Related posts

హైకోర్టు లో ఏపీ సర్కార్కు మరో ఎదురు దెబ్బ…

Drukpadam

జగన్ ప్రభుత్వంపై సొంతపార్టీ ఎమ్మెల్యే ఆనం రాంనారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తి …

Drukpadam

టీడీపీ సోషల్ మీడియా సమన్వయకర్త అరెస్టుకు సీఐడీ యత్నం… అడ్డుకున్న గోరంట్ల బుచ్చయ్య, టీడీపీ నేతలు

Drukpadam

Leave a Comment