Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

10వ, ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ నేతలు కె .శ్రీనివాస్ రెడ్డి , జమ్ములు..

10వ, ప్లీనరీ ఏర్పాట్లను సమీక్షించిన ఐజేయూ కె .శ్రీనివాస్ రెడ్డి , జమ్ములు..
-హాజరైన తెలంగాణ ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ
-చెన్నై లో తమిళనాడు , పాండిచ్చేరి రాష్ట్రాల నాయకుల హాజరు
-ముమ్మరంగా జరుగుతున్నా ఏర్పాట్లు
-25 రాష్ట్రాల నుంచి ప్రతినిధుల హాజరు

దేశంలోనే జర్నలిస్టుల హక్కుల సాధనకోసంనిరంతరం ఉద్యమిస్తున్న నిర్మాణాయుతమైన సంఘంగా పేరున్న ఉన్న ఐజేయూ 10 ప్లీనరీ సమావేశాలు దక్షణ భారత దేశంలోనే అత్యంత కీలక రాష్ట్రంగా ఉన్న తమిళనాడులో జరిపేందుకు ఆ సంఘనేతలు పట్టుదలతో ఉన్నారు . ఈ సమావేశాలకు 25 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు హాజరు కానున్నారు . కేంద్ర రాష్ట్ర మంత్రులు కూడా ఈసమావేశాలకు హాజరైయ్యే అవకాశం ఉంది. ఇందుకోసం జరుగుతున్నా ఏర్పాట్లను ఐజేయూ అధ్యక్షులు కె.శ్రీనివాస్ రెడ్డి , సెక్రటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్ము, మాజీ అధ్యక్షులు ఎస్.ఎన్.సిన్హాలు ప్రత్యేకంగా హాజరై ఏర్పాట్లను పరిశీలించారు . ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె .విరహత్ అలీ కూడా పాల్గొన్నారు . దేశంలో జర్నలిస్టులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై సమావేశంలో చర్చించి తీర్మానాలు చేయనున్నట్లు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు . మీడియా కమిషన్ ఏర్పాటు , కాశ్మిర్ లో మీడియా ఎదుర్కొంటున్న సవాళ్లు , కొత్త వేతన చట్టం .. ప్రెస్ కౌన్సిల్ లో జర్నలిస్ట్ సంఘాలకు ప్రాతినిధ్యం లాంటి విషయాలపై చర్చించి కార్యాచరణ ప్రకటిస్తామని అన్నారు

అక్టోబర్ 29,30,31 తేదీల్లో చెన్నైలో జరగనున్న ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్(ఐజేయూ) జాతీయ 10వ, ప్లీనరీ సమావేశాల ఏర్పాట్లను సోమవారం నాడు ఐజేయూ నేతలు కే.శ్రీనివాస్ రెడ్డి, బల్విందర్ సింగ్ జమ్ము, ఎస్.ఎన్.సిన్హాలు సమీక్షించారు. ఈ ప్లీనరీకి అతిథ్యమిస్తున్న తమిళనాడు జర్నలిస్ట్స్ యూనియన్(టీజేయు) రాష్ట్ర అధ్యక్షులు డి.ఎస్.ఆర్ సుభాష్, ప్రధాన కార్యదర్శి రమేష్, పాండిచ్ఛేరి రాష్ట్ర జర్నలిస్ట్స్ యూనియన్ అధ్యక్షుడు మదిమహారాజతో పాటు ఆ రాష్ట్ర యూనియన్ ప్రధాన బాధ్యులు హాజరై ఏర్పాట్లను వివరించారు. ప్లీనరీలో దేశంలోని దాదాపు 25 రాష్ట్రాల నుండి కౌన్సిల్ సభ్యులు హాజరవుతున్నందున వారు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా సంతృప్తికరమైన ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులకు ఐజేయూ అధ్యక్షులు కే. శ్రీనివాస్ రెడ్డి సూచించారు. ప్రతినిధులకు వసతి సౌకర్యం, భోజన ఏర్పాట్ల వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అలాగే సభాస్థలి, అతిథులు తదితర ఏర్పాట్లను నిర్వాహకులు వివరించారు.

Related posts

కర్ణాటకలో అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్..

Drukpadam

యమునోత్రి హైవేపై చిక్కుకుపోయిన 10 వేల మంది యాత్రికులు!

Drukpadam

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అందని జీతాలు …ఉద్యోగుల గగ్గోలు…

Drukpadam

Leave a Comment