Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పుకార్లు …కొట్టి పారేసిన శశిధర్ రెడ్డి!

మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు పుకార్లు …కొట్టి పారేసిన శశిధర్ రెడ్డి!
-కాంగ్రెస్ కు మరో షాక్ అంటూ వార్తలు
-బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీకి వెళ్లినట్లు కథనాలు
-ఒకే విమానంలో వెళ్ళింది నిజమేనంటున్న శశిధర్ రెడ్డి
-ఎవరిపని మీద వారు వెళ్లారని అంటున్న వైనం
-ఆయన వెంట డీకే అరుణ ఉందని ప్రచారం
-ఇటీవల రేవంత్ పై తీవ్ర విమర్శలు గుప్పించిన శశిధర్ రెడ్డి

తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇతర పార్టీలకు చెందిన కీలకమైన నేతలను చేర్చుకుంటూ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలపై గురి పెట్టింది. డీకే అరుణ, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తదితరులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. తాజాగా మరో సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి కూడా బీజేపీలో చేరబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై మర్రి శశిధర్ రెడ్డి స్పందించారు . ఢిల్లీలో ఈ సాయంత్రం ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని వస్తున్నా వార్తలను కొట్టిపారేశారు . హైద్రాబాద్ నుంచి ఢిల్లీకి బీజేపీ నేతలు తాము ఒకే విమానంలో వెళ్ళమని అయితే బీజేపీలో చేరుతున్నట్లు జరుగుతున్నా ప్రచారం వట్టిదే అని శశిధర్ రెడ్డి కొట్టి పారేశారు .

బీజేపీ నేతలతో కలిసి ఆయన ఢిల్లీకి వెళ్లారని అందువల్ల బీజేపీలో ఆయన చేరడం ఖాయం అని అన్నారు . ఆయనతో పాటు డీకే అరుణ కూడా ఉన్నారని వార్త కథనాల సారాంశం . కొన్ని రోజుల నుంచి ఆయన పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోన్ననేపథ్యంలో ఈ వార్త నిజమేనని ప్రచారానికి ఊపందుకుంది . ఇటీవలి కాలంలో శశిధర్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు సైతం ఆయన పార్టీ మారబోతున్నారనే దిశగా సంకేతాలను ఇస్తున్నట్టుగా ఉన్నాయని కూడా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఎవరి పనులమీద వారు ఢిల్లీ వెళ్లారని తెలుస్తుంది.

రేవంత్ రెడ్డిపై ఇటీవల శశిధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో కల్లోలానికి రేవంత్ కారణమని, కాంగ్రెస్ కు నష్టం కలిగించేలా ఆయన చేస్తున్న పనులు ఉన్నాయని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మాణికం ఠాగూర్ రేవంత్ కు ఏజెంట్ మాదిరి పని చేస్తున్నారని విమర్శించారు. అనంతకు ముందు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాణిక్యం ఠాకూర్ పై విమర్శలు గుప్పించారు .

Related posts

తదుపరి రాష్ట్రపతి ఎవరు? తేల్చనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలు!

Drukpadam

హుజూరాబాద్‌లో ఈటల గెలుపు పక్కా: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి!

Drukpadam

జమ్మూ కాశ్మీర్ లో ఆజాద్ కు షాక్ ఇచ్చిన అనుయాయులు !

Drukpadam

Leave a Comment