Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
క్రైమ్ వార్తలు

కర్ణాటకలో గాయని మంగ్లీ కారుపై రాళ్లదాడి…ఎలాంటి దాడి జరగలేదు మంగ్లీ!

గాయని మంగ్లీ కారుపై రాళ్లదాడి… ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
-కర్ణాటకలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న మంగ్లీ
-తిరిగొస్తుండగా కారుపై రాళ్ల దాడి
-బళ్లారిలో ఘటన

ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజుల కిందట బళ్లారి నగరంలో మున్సిపల్ కాలేజి మైదానంలో బళ్లారి ఉత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బళ్లారి ఉత్సవ్ వేడుకల్లో గాయని మంగ్లీ తన పాటలతో అలరించారు.

ఈ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా బళ్లారిలో ఆ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బళ్లారి ఉత్సవ్ సందర్భంగా… మంగ్లీ మేకప్ టెంట్ లో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు కొందరు యువకులు వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.

అంతకుముందు, చిక్కబళ్లాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ అతికష్టమ్మీద కన్నడలో కొన్ని మాటలు మాట్లాడింది. దాంతో, మంగ్లీపై విమర్శలు వచ్చాయి. రెండేళ్ల నుంచి కన్నడ చిత్ర పరిశ్రమలో ఉంటూ కన్నడలో మాట్లాడకపోవం ఏంటని విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారికి కన్నడ చిత్ర పరిశ్రమలో ఎందుకు అవకాశాలు ఇస్తారు? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి.

పై రెండు ఘటనల్లో ఏదో ఒక ఘటన కారణంగానే మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.

తనపై రాళ్లదాడి జరిగినట్లు వస్తున్న వార్తలను ఖండించిన మంగ్లీ

కర్ణాటక లో తనపై రాళ్లదాడి జరిగిందని సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సింగర్ మంగ్లీ తీవ్రంగా ఖండించారు . తనను కర్ణాటక ప్రజలు ఎంతో ప్రేమతో , జాగ్రత్తగా చూసుకున్నారని కొంతమంది కావాలని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు .ఇదే ఉద్దేశ పూర్వకంగా చేస్తున్న ప్రచారంలా ఉందని అభిప్రాయపడ్డారు .తనపై ఎలాంటి రాళ్లదాడి జరగలేదని పేర్కొన్నారు .

Related posts

లఖిమ్ పూర్ ఖేరి ఘటనలో చనిపోయిన జర్నలిస్ట్ ఐ జె యూ సభ్యుడు!

Drukpadam

‘ఏ క్షణంలోనైనా మృత్యువు మీ ద‌రికి చేర‌వ‌చ్చు’…61 మందికి బెదిరింపు లేఖ‌లు!

Drukpadam

వివేకా హత్యతో ఎర్ర గంగిరెడ్డి ,సునీల్ కుమార్ ,దస్తగిరిల ప్రమేయం పై అనుమానాలు!

Drukpadam

Leave a Comment