రాజకీయ వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ యస్ సిట్టింగ్ లలో ఉండేదెవరు, ఊడేదెవరు ….?

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ యస్ సిట్టింగ్ లలో ఉండేదెవరు, ఊడేదెవరు ….?
లెఫ్ట్ దోస్తీతో ఎవరి సీట్లు గల్లంతు
గత ఎన్నికల్లో ఒక్క సీటే గెలిచిన గులాబీ పార్టీ
కాంగ్రెస్ నుంచి గెలిచిన ఐదుగురు , టీడీపీ నుంచి గెలిచిన ఇద్దరు . ఒకస్వతంత్ర ఎమ్మెల్యేలు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు
సిట్టింగ్ లకే సీట్లు అంటే గతంలో అధికార పార్టీ నుంచి పోటీచేసిన వారి పరిస్థితి ఏమిటి ?
సిట్టింగ్ ల్లో ఉండేదెవరుఊడేదెవరు ….?
బలమైన పార్టీ సత్తా చాటుతుందా
నెగిటివ్ గా ఉన్న అభ్యర్థులు ఎవరు …?
సర్వే లు ఏమి చెపుతున్నాయి.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు గమ్మత్తుగా ఉన్నాయి. ఇప్పటికి పైకి చూడటానికి బీఆర్ యస్ బలమైన పార్టీగా కనిపిస్తుంది. 8 మంది ఎమ్మెల్యేలు , నలుగురు ఎంపీలు ,( ఇద్దరు రాజ్యసభ కలుపుకొని ) ఇద్దరు ఎమ్మెల్సీలు కలిగి పటిష్టంగా కనపడుతుంది . 2018 ఎన్నికలకు ముందు కూడా ఇదే విధంగా ఉంది . కానీ ఎన్నికల్లో మాత్రం ఒక్క ఖమ్మం సీటు తప్ప అన్ని సీట్లలో ఓటమి చవి చూసింది . టీడీపీ కాంగ్రెస్ పొత్తులో భాగంగా మిగతా తొమ్మిది సీట్లలో కాంగ్రెస్ 5 , టీడీపీ రెండు, ఒకదానిలో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు . తర్వాత ఇద్దరు కాంగ్రెస్ సభ్యులు మినహా అందరు అధికార టీఆర్ యస్ కు జైకొట్టారు . అప్పట్లో మంత్రిగా ఉండి పాలేరు ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ తో విజయం సంధించిన తుమ్మల నాగేశ్వరావు ఓటమి చెందటం సంచలనంగా మారింది .తుమ్మల ఓటమి కారణం ఎవరు అనేదిఇంకా సస్పెస్ థ్రిల్లర్గానే ఉంది.

తిరిగి ఎన్నికలు దగ్గర పడుతున్నాయి….సిట్టింగ్ లందరికి సీట్లు ఇస్తామని కేసీఆర్ చెప్పారు ….కానీ సర్వే లలో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పై నెగిటివ్ ఉందని తిరిగి వారినే పోటీలో పెడితే బీఆర్ యస్ కు అధికారం దక్కడం ఇబ్బందిని అంటున్నారు . మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్వయంగా చెప్పిన లెక్కల ప్రకారమే 20 నుంచి 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను బీఆర్ యస్ మార్చకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయని సర్వే సారాంశం చెప్పారు . అయితే ఆయన జిల్లాలో ఎవరిని మార్చాల్సిఉందనే విషయం వెల్లడించలేదు . ఖమ్మం జిల్లాకు సంబంధించి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత పార్టీ మారిన వారేఅందువల్ల గతంలో పోటీచేసిన వారి పరిస్థితి ఏమిటనేది ప్రశ్నర్ధకంగా మారిందిఉమ్మడి జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ సీట్లు ఉండగా వాటిలో 7 రిజర్వుడ్ సీట్లు అందులో కూడా ఐదు ఎస్టీ , రెండు ఎస్సీ రిజర్వుడ్ గా ఉన్నాయి. పొతే మూడు మాత్రమే జనరల్ సీట్లువాటిలో కూడా ఖమ్మం జిల్లాలో ఖమ్మం ,పాలేరు , భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం సీట్లు జనరల్ గా ఉన్నాయి. జిల్లాలో లెఫ్ట్ దోస్తీతో ఎవరు సీట్లు గల్లంతు అనే చర్చ జరుగుతుంది . రాష్ట్రంలో జిల్లాలో లేని సంకట పరిస్థితి అందులో కూడా సామజిక వర్గాల వారీగా చూస్తే ఒకటి కమ్మ ,ఒకరి రెడ్డి, మరొకటి బీసీలకు ఇవ్వాలి . కానీ అది జరిగే పని కాదు .. ఆశావహుల్లో ఎవరికీ సీట్లు ఉంటాయిఎవరికీ గల్లంతు అవుతున్నాయనేది చర్చనీయాంశమైంది

పాలేరు జనరల్

గత ఎన్నికల్లో టీఆర్ యస్ తరుపున మాజీమంత్రి తుమ్మల పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడి పోయారు . ఇప్పుడు ఇద్దరు తమకే టికెట్ కావాలని అంటున్నారు . సీటింగ్ లకే ఇచ్చేట్లు అయితే కందాల పోటీ ఖాయంకానీ తుమ్మల కూడా బలంగా కోరుతున్నారు . బీఆర్ యస్ ఖమ్మం సభ ముందువరకు పార్టీకి దూరంగా స్వతంత్ర కార్యాచరణ చేపట్టిన తుమ్మల తర్వాత సైలంట్ అయ్యారు . కేసీఆర్ నుంచి తుమ్మలకు హామీ వచ్చిందని ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎమ్మెల్యే సీటా? లేక ఎమ్మెల్సీ నా అనేది వారు కూడా చెప్పలేకపోతున్నారు .అది నిజమో కాదో కూడా అంతుపట్టని విషయం .ఇక సీటు మాకు కావాలని సిపిఎం సైతం గట్టిగా అడుగుతుంది. ఇక్కడ సిపిఎం నేత తమ్మినేని పోటీలో ఉండవచ్చునని కేసీఆర్ కూడా ఆయనకు గట్టి హామీ ఇచ్చారని తెలుస్తుంది. ఇదే నిజమైతే అప్పుడు కందాల , తుమ్మల వైఖరి ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది .

ఖమ్మం జనరల్

ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నారు .పార్టీ టికెట్ కచ్చితంగా ఆయనకే ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడ్డాయి. ఖమ్మంను రాష్ట్రంలోనే అన్ని నియోజకవర్గాలకన్నా అభివృద్ధి చేశారని పేరుంది .కేసీఆర్ మదిలో ఏదైనా కొత్త ఆలోచన ఉంటె తప్ప అజయ్ పోటీ ఖాయం

మధిర ఎస్సీ నియోజకవర్గం

ఇక్కడ నుంచి గత మూడు సార్లు పోటీచేసిన జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తిరిగి టికెట్ ఆశిస్తున్నారు . మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క చేతిలో ఓడిపోయారు . బమ్మెర రామ్మూర్తి , డాక్టర్ కోట రాంబాబులు ఇక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నా వారు పొంగులేటి శిభిరంలో చేరారు .అందువల్ల లింగాల కమల్ రాజా కాకపోతే గతంలో టీడీపీ నుంచి ఇక్కడ పోటీచేసిన మోత్కుపల్లి నర్సింహులు వచ్చిన ఆశ్చర్యం లేదని అంటున్నారు .

వైరా ఎస్టీ ….

ప్రస్తుతం లావుడ్య రాములు నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు .స్వతంత్రంగా గెలిచి అధికార టీఆర్ యస్ లో చేరారు .అయితే ఈసారి తిరిగి మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్న డాక్టర్ చంద్రావతి ,లేదా మదన్ లాల్ లో ఒకరికి ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.వారు కూడా తరుచు నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు .

సత్తుపల్లి ఎస్సీ ….

సీనియర్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు . గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి మారిన రాజకీయ పరిస్థితిల్లో అధికార టీఆర్ యస్ లో చేరారు . చేరిక సందర్భంగా మంత్రి పదవి ఇస్తానని ఆఫర్ చేశారు .కానీ అది ఇవ్వలేదు . అనూహ్యమైన మార్పులు జరిగితే తప్ప వెంకటవీరయ్య నే సత్తుపల్లి బీఆర్ యస్ అభ్యర్థి

కొత్తగూడెం జనరల్

ప్రస్తుతం ఇక్కడ నుంచి సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా ఉన్నారు . మంచివాడిగా పేరుంది .కలుపుగోలు తనం ఆయన ప్రత్యేకత ….కానీ వయోభారం మైనస్ గా మారింది. వనమా గత ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి గెలిచి అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు . … 2014 లో టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసి ఉమ్మడి జిల్లాలో ఒక్కడుగు గెలిచిన జలగం వెంకట్రావు ,2018 ఎన్నికల్లో ఓడిపోయారు . ఇటీవల వరకు పార్టీకి దూరంగా ఉన్న ఆయన్ను ఖమ్మం బీఆర్ యస్ సభకు రావాలని స్వయంగా కేసీఆర్ పిలవడంతో ఆయన ఆఘమేఘాలమీద వచ్చారు . దీంతో వనమా వర్గం షాక్ గురైంది. అయితే విచిత్రం ఏమంటే సీటు సిపిఐ గట్టిగా కోరుతుంది.ఇక్కడ నుంచి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని పోటీచేస్తారని ప్రచారం జరుగుతుంది.అప్పడు వనమా , జలగం ఎలాంటి లైన్ తీసుకుంటారు అనేది ఆసక్తిగా మారింది.

ఇల్లందు ఎస్టీ …..

ప్రస్తుతం ఎమ్మెల్యేగా హరిప్రియ నాయక్ ఉన్నారు . ఆమె కాంగ్రెస్ నుంచి గెలిచి అధికార పార్టీలో చేరారు .అక్కడ నుంచి టికెట్ ఆశిస్తున్నా కోరం కనకయ్య ఇప్పుడు పొంగులేటి శిభిరంలో చేరారు . దీంతో ఆమెకు అడ్డు ఎవరు లేరని అనుకుంటుండగా కొందరు ఇల్లందు నుంచి అధికార పార్టీ అభ్యర్థిగా పోటీచేసేందుకు ఆసక్తి చూపుతున్నారు .

అశ్వారావుపేట ఎస్టీ ….

గతంలో ఇక్కడ టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వరరావు అధికార పార్టీలో చేరారు . సిట్టింగ్ జాబితాలో సీటు ఇస్తారా ?లేక కొత్తవారిని తెస్తారా ? అనే చర్చ నడుస్తుంది.

పినపాక ఎస్టీ ….

ఇది ఇప్పుడు అత్యంత కీలక నియోజకవర్గంఇక్కడ నుంచి టీఆర్ యస్ అభ్యర్థిగా పోటీచేసిన పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన రేగా కాంతారావు చేతిలో ఓడిపోయారు . రేగా కాంతారావు కు బీజేపీ తమవైపు లాక్కునేందుకు గాలం వేసింది. చకచకా రాజకీయపరిణామాలు మారిన నేపథ్యంలో ఎవరు దొరఎవరు దొంగ అనేది కోర్ట్ పరిధిలోకి పోయింది . కేసీఆర్ ఏది చెబితే అది చేస్తానని ఎవరికీ సీటు ఇస్తే వారికీ చేస్తానని ఇటీవల కాలంలో రేగా మాట్లాడుతున్నారు . రేగా కు సీటు రాదా ? లేక ఆయన్ను మహబూబాబాద్ పార్లమెంట్ కు పోటీచేసే ఆలోచన ఏమైనా ఉందా అనే సందేహాలు కలుగుతున్నాయి. ఇక్కడ ఎలాంటి పరిణామాలైన జరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయాలు ఉన్నాయి.

భద్రాచలం ఎస్టీ …..

గతంలో ఇక్కడ పోటీచేసిన డాక్టర్ తెల్లం వెంకట్రావు పొంగులేటి అనుయాయుడుఅందువల్ల బీఆర్ యస్ ఇక్కడ నుంచి పోటీచేస్తే కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతుంది. అయితే సీటు సిపిఎం కావాలంటుంది. గతంలో అనేక సార్లు సిపిఎం ఒంటరిగానే పోటీచేసి గెలిచింది . సిపిఎం కు సీటు కేటాయించవచ్చుననే అభిప్రాయాలు ఉన్నాయి.

Related posts

తన ఇంటికి వచ్చిన బండి సంజయ్​ని ఆలింగనం చేసుకున్న బూర నర్సయ్య!

Drukpadam

తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన జస్టిస్ చంద్రు…

Drukpadam

ప‌నిచేసే వారికే పార్టీ టికెట్లు… కాంగ్రెస్ నేత‌ల‌కు తేల్చిచెప్పిన రాహుల్!

Drukpadam