క్రైమ్ వార్తలు

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు!

వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు!

  • కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేసేందుకు యత్నించారని కేసు
  • తన అనుచరుడు, డ్రైవర్ తో కలిసి కిడ్నాప్ కు యత్నించారని ఎఫ్ఐఆర్
  • కేసు నమోదు చేసిన వేదాయపాలెం పోలీసులు

వైసీపీ అధిష్ఠానంపై తిరుగుబాటు జెండా ఎగురవేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదయింది. తన అనుచరులతో కలిసి కార్పొరేటర్ మూలే విజయభాస్కర్ రెడ్డిని కిడ్నాప్ చేశారంటూ వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. 

వేదాయపాలెం ఇన్స్ పెక్టర్ కె. నరసింహారావు వెల్లడించిన వివరాల ప్రకారం… వైసీపీని వీడి తనతో రావాలంటూ నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డికి నిన్న కోటంరెడ్డి ఫోన్ చేసి కోరారు. అయితే విజయభాస్కర్ రెడ్డి దానికి నిరాకరించడంతో… తన అనుచరుడు మిద్దె మురళీకృష్ణ యాదవ్, డ్రైవర్ అంకయ్యతో కలిసి వెళ్లి ఆయనను బెదిరించారు. కార్పొరేటర్ ను బలవంతంగా కారులో ఎక్కించేందుకు ప్రయత్నించగా, ఆయన తప్పించుకుని వేదాయపాలెం పోలీస్ స్టేషన్ కు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలోనే కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.

Related posts

పాకిస్థాన్‌లో పరువు హత్య: మోడలింగ్ చేస్తోందని సోదరిని కాల్చి చంపిన అన్న!

Drukpadam

మద్యం తాగించి.. ఇద్దరు మహిళా కూలీలపై వ్యాపారుల అత్యాచారం…

Ram Narayana

వీధి కుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడి మృతి.. హైదరాబాద్ లో దారుణం..!

Drukpadam