క్రైమ్ వార్తలు

నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు!

నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకున్న విద్యార్థినులు! గ్రూపులుగా విడిపోయి రచ్చ

  • చెన్నైలో వెలుగు చూసిన ఘటన
  • తన ప్రియుడికి మెసేజ్ పంపినందుకు సహచర విద్యార్థినిపై బాలిక ఆగ్రహం
  • నడివీధిలో గొడవ పడ్డ ఇద్దరు బాలికలు
  • వారికి మద్దతుగా రంగంలోకి దిగిన స్నేహితులు
  • గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుమీద కొట్టుకున్న విద్యార్థినులు

పాఠశాల విద్యార్థినులు గ్రూపులుగా విడిపోయి నడిరోడ్డుపై కొట్టుకున్న ఘటన చెన్నైలోని పెరంబూర్‌‌లో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పూర్తి వివరాల్లోకి వెళితే.. పుదురామకృష్ణాపురంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 600 మంది విద్యార్థులు చదువుతున్నారు.

సోమవారం సాయంత్రం ప్లన్ వన్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినులు నడిరోడ్డుపై గొడవపడటం ప్రారంభించారు. వారిలో ఓ బాలిక తన సహచర విద్యార్థితో ప్రేమాయణం నడుపుతోందని సమాచారం. అయితే.. తన ప్రియుడికి మరో బాలిక వాట్సాప్ మెసేజ్ పంపడంతో వారిద్దరి మధ్య వివాదం తలెత్తింది. ఇద్దరూ నడిరోడ్డుమీదే గొడవపడటం ప్రారంభించారు. ఈ క్రమంలోనే బాలికల స్నేహితులు కూడా వారికి జతకూడారు. దీంతో.. వారందరూ రెండు గ్రూపులుగా విడిపోయి జుట్టుపట్టుకుని కొట్టుకున్నారు. కాగా.. ఈ వ్యవహారం మొత్తం పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దృష్టికి వెళ్లడంతో వారు స్టూడెంట్స్‌ను విచారిస్తున్నారు.

Related posts

అమెరికాలో విషాదం.. భారత సంతతి సంపన్న కుటుంబం ఆత్మహత్య?

Ram Narayana

కలెక్టరేట్‌లోనే లంచాల దందా… ఏసీబీకి చిక్కిన మహిళా ఉద్యోగి

Ram Narayana

భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసిన భార్య.. ప్రియుడితో కలిసి ఘాతుకం!

Drukpadam