ఆంధ్రప్రదేశ్

తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం… భారీ వర్షం

తిరుమలలో ఒక్కసారిగా మారిన వాతావరణం… భారీ వర్షం
-ఏపీలో పలు చోట్ల ఆకస్మిక వర్షాలు
-తిరుమలను కమ్మేసిన కారుమబ్బులు
-ఉరుములు మెరుపులతో వర్షం

ఏపీలో ఈ సాయంత్రం పలుచోట్ల ఆకస్మిక వర్షాలు కురిశాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. మధ్యాహ్నం నుంచి అధిక ఉష్ణోగ్రత నెలకొన్న తిరుమల కొండలను సాయంత్రానికి మేఘాలు కమ్మేశాయి. భారీ వర్షంతో తిరుమల తడిసి ముద్దయింది. భక్తులు ఇబ్బందులు పడ్డారు . మాడవీధులన్ని వర్షంతో నిండిపోయాయి . తిరుమల వీధుల్లో వ్యాపారులు , భక్తులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు .

శ్రీవారి ఆలయం ఎదుట, తిరు మాడవీధుల్లో నీరు ప్రవవహించింది. దర్శనం ముగించుకుని అప్పుడే బయటికి వచ్చిన భక్తులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో ఇబ్బంది పడ్డారు. పలు షాపింగ్ సముదాయాల్లోకి నీరు ప్రవేశించింది.

ఈవర్షానికి ముందు ఉక్కపోతతో ఇబ్బందులు పడ్డ భక్తులు మధ్యాన్నానికి వాతావరణం చల్లబడటంతో హాయిగా ఊపిరి పీల్చుకున్నారు . తర్వాత దేవుని దర్శనానికి వెళ్లారు . ఒక్కసారిగా ఉరుములు మెరుపులు వర్షతో తడిసిపోయారు .

Related posts

ప్రభుత్వ నిర్లక్ష్యం, నాణ్యతలేని నిర్మాణం వల్లే సింహాచలం దుర్ఘటన – మాజీ సీఎం జగన్

Ram Narayana

చీఫ్ సెక్రటరీపై విమర్శలు గుప్పించిన ఏపీ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ!

Drukpadam

Drukpadam