ఆంధ్రప్రదేశ్

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి…

చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి…

  • నేడు చంద్రబాబు పుట్టినరోజు
  • బర్త్ డే గ్రీటింగ్స్ తెలిపిన విజయసాయిరెడ్డి
  • ఎన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించిన విజయసాయి

టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ‘టీడీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సంపూర్ణ ఆరోగ్యం, దీర్ఘాయుష్షుతో మరెన్నో ఆనందకరమైన పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని విజయసాయి ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాకు విజయసాయి దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. ముఖ్యంగా చంద్రబాబు, టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ట్వీట్లు చేయడాన్ని దాదాపుగా ఆపేశారు. ఈ తరుణంలో చంద్రబాబుకు ఆయన శుభాకాంక్షలు తెలపడం అందరినీ ఆకట్టుకుంటోంది.

Related posts

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌కు షాక్.. లా ట్రిబ్యునల్ కోర్టులో చుక్కెదురు !

Drukpadam

స్కిల్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చిన ఈడీ..

Ram Narayana

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై కేంద్రం స‌హా ఏపీ, తెలంగాణ‌ల‌కు సుప్రీంకోర్టు నోటీసులు

Drukpadam