Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొత్త సచివాలయం ప్రారంభంపై ప్రతిపక్షాల మూతి విరుపులు…

కొత్త సచివాలయం ప్రారంభంపై ప్రతిపక్షాల మూతి విరుపులు…
-ప్రోటోకాల్ పాటించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజం
-తాము అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయం ,అంబేత్కర్ విగ్రహం -ఏర్పాటులో అవినీతిపై విచారణ జరిపిస్తామన్న రేవంత్
-సచివాలయానికి వెళ్లబోమన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్
-సచివాలయ ప్రాకారాలు మారుస్తామని వెల్లడి

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైద్రాబాద్ లో సచివాలయాన్ని అత్యంత విలాసవంతంగా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ యస్ సర్కార్ నిర్మించింది. దేశంలోనే ఇలాంటి సచివాలయంలేదని అంటున్నారు. అమెరికా పార్లమెంట్ శ్వేతా సౌధాన్ని పోలిన విధంగా ఉన్న ఈ భవనం అందంగా నిర్మించారు .సుమారు 800 కోట్లు ఖర్చు అయిందని అంటున్నారు .అయితే ఇది రాష్ట్ర సిగలో మరో మణిహారమని అభిప్రాయాలు ఉండగా లేదు…లేదు ఇది అవినీతి సౌధమని , రాష్ట్రంలో అప్పుల్లో ఉండగా ఉన్న సచివాలయాన్ని కూల్చి కొత్తది నిర్మించడం పై విమర్శలు ఉన్నాయి. ఇది ఒక్క బీఆర్ యస్ భవనం లాగా ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ పాటించలేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు . తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కచ్చితంగా బీఆర్ యస్ ప్రభుత్వం అవినీతిపై విచారణ జరిపిస్తామని ప్రకటించారు . సచివాలయానికి కనీసం రాష్ట్ర గవర్నర్ తమిళ సై ని పిలవక పోవడాన్ని రేవంత్ తప్పు పట్టారు . ఇది సీఎం చంద్రశేఖర్ రావు నియంత విధానాలకు పరాకాష్టని పేర్కొన్నారు .

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ సచివాలయ ప్రాకారాలు మర్చి తీరుతామని తాము అధికారంలోకి రాగానే జరిగేది అదేనన్నారు . అప్పటివరకు సచివాలయంలో అడుగు పెట్టబోమని శపథం చేశారు . అయితే బీజేపీకి చెందిన దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు తాను సోమవారం సచివాలయానికి వెళ్లి సీఎంను కలిసి నియోజకవర్గానికి సంబందించిన సమస్యలపై వినతి పత్రం ఇస్తానని అన్నారు . బీజేపీకి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఇప్పైటికైనా సీఎం కేసీఆర్ సచివాలయం నుంచి కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు . బీజేపీలోనే సచివాలయం విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. అయితే గవర్నర్ ను కార్యక్రమానికి పిలవకపోవడంపై పార్టీలకు అతీతంగా ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది….

Related posts

భూముల వేలంపై ప్రభుత్వానికి షాకిచ్చిన రేవంత్!

Drukpadam

విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన మార్గరెట్ అల్వా!

Drukpadam

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో నాలుగు బీజేపీకే.. తేల్చేసిన సీ-ఓటర్ సర్వే!

Drukpadam

Leave a Comment