Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

పొంగులేటి రాష్ట్రరాజకీయ క్రీడలో సమిధ కాబోతున్నారా …?

పొంగులేటి రాష్ట్రరాజకీయ క్రీడలో సమిధ కాబోతున్నారా …?
పొంగులేటి రాజకీయ నిర్ణయం పై అనుయాయుల్లో ఆతర్మధనం
బీజేపీ నాయకులు ఖమ్మంలో పొంగులేటిని కలవడం దేనికి సంకేతం
బీజేపీ నేతలను ఖమ్మంలో ఆయన ఇంటికి ఆహ్వానించడంలో ఆంతర్యం ఏమిటి ….
బీఆర్ యస్ కు ఛాలంజ్ చేసిన శ్రీనివాస్ రెడ్డి పప్పులో కాలేసినట్లేనా ..
ఒకవేళ బీజేపీ లో చేరితే 10 కి 10 సీట్లు గెలిచే అవకాశం ఉందా ..
ఆయన నిర్ణయం ఆత్మహత్య సదృశ్యం కానున్నదా…?

రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి…. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీసుకునే రాజకీయ నిర్ణయంపై రాష్ట్రం ఆసక్తిగా ఎదురు చూస్తుంది. రాజకీయాల్లో హత్యలు ఉండవు ..ఆత్మహత్యలే అంటారు ..అది నిజం కాబోతుందా .. ఆయన రాజకీయాల్లో సమిధ కాబోతున్నారా …? అనే మీమాంస పొంగులేటి ప్రేమించే ప్రతి ఒక్కరి మదిలో మెదులు తోంది. ఆయన ఇంటికి బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటెల రాజేందర్ తోపాటు ఎమ్మెల్యే రఘునందన్ రావు ,కొండా విశ్వేశర రెడ్డి , మాజీ ఎమ్మెల్యేలు రవీందర్ రెడ్డి, మహేశ్వర రెడ్డిలాంటి బీజేపీ నేతలు గురువారం వస్తున్నారని వార్తలు రావడంతో ఆయన బీజేపీలో చేరబోతున్నారనే సంకేతాలు వెళ్లాయి. దీనిపై ఆయన నిజంగా చేరబోతున్నారా…? లేదా …? అని రాజకీయ వర్గాలు ఆరాతీస్తున్నాయి. .. ఇది జరిగితే జిల్లా రాజకీయ ముఖ చిత్రం మారుతుందా …? బీజేపీకి జిల్లాలో 10 కి 10 సీట్లు వస్తాయా …? అంటే ఇది కానిపని అంటున్నారు .విశ్లేషకులుఖమ్మం జిల్లాలో ఎన్ని పార్టీలు వచ్చినా కాంగ్రెస్ కు , కమ్యూనిస్టులకు బలం బలగం ఉన్నాయి. అందువల్ల పొంగులేటి లాంటి వ్యక్తి చేరి తనకున్న ఇమేజీని డ్యామేజీ చేసుకుంటాడాఅనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటివరకు ఆయన అడుగులో అడుగులేసిన హితులు ,సన్నిహితులు బీజేపీ నేతలను ఇంటికి ఆహ్వానించడంపై ఆతర్మధనంలో పడ్డారు . కీం కర్తవ్యం అనే ఆలోచలలు చేస్తున్నారు . అందుకు కారణం లేకపోలేదుఖమ్మం జిల్లాలో బీజేపీకి కనీసం ఉనికి లేదు .పైగా ఇక్కడ రేపు సీట్లు వస్తాయనే గ్యారంటీ లేదుబీఆర్ యస్ తనను అధికారికంగా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన రోజున మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి 10 కి 10 సీట్లు గెలుస్తామని తొడగొట్టిన సవాల్ చేసిన పొంగులేటికి బీజేపీ లో చేరితే ఇదే సాధ్యమయ్యే పనికాదని రాజకీయ పండితుల అభిప్రాయందీంతో ఆయన ఒట్టు తీసు గట్టున పెట్టుకోవాల్సిందేఅంతే కాదుఆయన మంచి మాటకారితనం వల్ల కాన కష్టంగా ఒకటి అర సీటు గెలిచినా అది బీజేపీ ఖాతాలోకే వెళ్లుతుందితప్పపొంగులేటి వల్ల వచ్చిందనేది ఉండదుదీంతో బీఆర్ యస్ లో ఒక్కరిని కూడా అసెంబ్లీ గేటు తాకనివ్వనని చేసిన సవాళ్లు ఉత్తర కుమార ప్రగల్బాలుగా మిగిలి పోవడం ఖాయం .

రాజకీయాలలో ఒడిదుడుకులు సహజంకానీ స్థితప్రజ్ఞత అవసరంతీసుకునే నిర్ణయం మంచిదా …? చెడ్డదా …? ప్రజల మూడ్ ఏమిటి అనేది ఆలోచించాలిఖమ్మం జిల్లా గడ్డ రాజకీయ చైతన్యం కలిగింది . “నీ బంచన్ దొరానీ కాళ్ళు మొక్కుతాఅనే స్థితినుంచి తల ఎత్తుకుని తిరగగలిగే వైపు అడుగులు వేసింది. ఇందుకు అనేక మంది త్యాగధనులు త్యాగాలు కారణంసాయుధ తెలంగాణా రైతాంగ పోరాటం నుంచి నేటి వరకు జిల్లాలో మతాలకు , ప్రాంతాలకు తావు లేకుండా అందరు అన్నదమ్ములు , అక్క చెల్లెళ్ళ వలె జీవనం సాగిస్తున్నారు . పొంగులేటి కూడా చైతన్యం కలిగిన వ్యక్తిగా ప్రజలు భావిస్తున్నారు . అన్న , అక్క , పెద్దాయన అనే పిలిచే ఆయన పిలుపులో ప్రత్యేక ఆకర్షణ ఉంది. అయితే ఆయన తీసుకునే రాజకీయ నిర్ణయానికి, ప్రజలు అందరు అనుకూలంగా ఉంటారనే గ్యారంటీ లేదు . స్నేహం వేరు ..రాజకీయాలు వేరుఅందువల్ల ఆయన వేసే ప్రతి అడుగు ప్రజలకు ప్రత్యేకించి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలకు ఉపయోగపడేదిగా ఉండాలి తప్ప వ్యక్తిగా తన స్వార్థం కోసం వెళ్లాడని అపవాదు మూటకట్టుకోరాదు .. ఆయనకు రాజకీయ గురువు ఎవరు లేకపోయినా జగన్ మాట ప్రకారం నడుచుకుంటారనే అభిప్రాయం ఉంది. కానీ బీజేపీ అక్కడ జగన్ కు కూడా వ్యతిరేకంగా పావులు కదుపుతోందని అంటున్నారు . జగన్ ను వ్యతిరేకిస్తున్నట్లు స్వయంగా బీజేపీ నేతలే ప్రకటిస్తున్న సందర్భాలు కోకోల్లలు

తాను ఏపార్టీకి వెళ్ళేది సమయం వచ్చినప్పుడు చెపుతానని ..తప్పకుండ చెప్పే చేరతానని తరుచు చెపుతున్న పొంగులేటి వ్యూహాత్మకంగా బీజేపీ నేతలను ఆహ్వానించారా ..? అందులో చేరేందుకు సంకేతాలు ఇచ్చేందుకే చేశారా ..? అంటే అవుననే అభిప్రాయాలే వ్యక్తం అవుతున్నాయి…. గతంలో కాంగ్రెస్ వాళ్ళను ,బీజేపీ వాళ్ళను కలిసిన పొంగులేటి రహస్య ప్రదేశాల్లో కలిశారని పుకార్లు ఉన్నాయి. సీఎల్పీ నేత పొంగులేటిని కలిసేందుకు సమయం అడిగితె ఇష్ట పడలేదు ..కానీ నేడు నేరుగా బీజేపీ నేతలు రావడానికి అంగీకరించి మర్యాదలు చేయడంపై పొంగులేటి రాజకీయంగా తప్పటడుగు వేస్తున్నారా ..? అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి

 

Related posts

పార్లమెంటరీ పిఎసి సమావేశంలో కరోనా సెకండ్ వేవ్ పై వాడివేడి చర్చ!

Drukpadam

మోడీ, జగన్ లపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు…

Drukpadam

ప్రధాని మోడీ పై ఆసక్తి రేపుతున్న శరద్ పవార్ ప్రసంశలు…

Drukpadam

Leave a Comment