Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

వ్యభిచారం నేరం కాదు… కానీ పబ్లిక్ ప్లేసుల్లో చేస్తే నేరమే: ముంబయి కోర్టు!

వ్యభిచారం నేరం కాదు… కానీ పబ్లిక్ ప్లేసుల్లో చేస్తే నేరమే: ముంబయి కోర్టు!

  • ముంబయిలో ఓ వ్యభిచార గృహంపై పోలీసుల దాడి
  • 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • సంరక్షణ కేంద్రానికి తరలించాలన్న కోర్టు
  • సెషన్స్ కోర్టును ఆశ్రయించిన మహిళ 

వ్యభిచారంపై ముంబయి సెషన్స్ కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. వ్యభిచారం నేరం కాదని స్పష్టం చేసింది. అయితే బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారానికి పాల్పడడం మాత్రం నేరమేనని పేర్కొంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యభిచారం ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుందని అభిప్రాయపడింది.

ముంబయిలోని ఒక వ్యభిచార గృహంపై దాడి చేసిన పోలీసులు 34 ఏళ్ల మహిళను అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో ఆమెను హాజరుపర్చగా, ఓ ఏడాది పాటు సంరక్షణ కేంద్రంలో ఉండాలని తీర్పునిచ్చారు. దాంతో ఆమె సెషన్స్ కోర్టును ఆశ్రయించింది. ఆ మహిళ కేసుపై విచారణ చేపట్టిన ముంబయి సెషన్స్ కోర్టు… ఆమెకు సంరక్షణ కేంద్రం నుంచి విముక్తి కల్పించాలని ఆదేశించింది.

బాధితురాలు మేజర్ అని, ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను నిర్బంధిస్తే ఆమె హక్కులకు భంగం కలిగించినట్టేనని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. ఆమె బహిరంగ ప్రదేశంలో వ్యభిచారం చేసిందని పోలీసు నివేదికలో ఎక్కడా పేర్కొనలేదని స్పష్టం చేశారు. అలాంటప్పుడు ఆమె నేరం చేసినట్టు కాదని వివరించారు.

Related posts

చార్లోటే నగరం నేడు ‘తెలుగు హెరిటేజ్ డే’గా పాటించడం అందరికీ గర్వకారణం: చంద్రబాబు

Drukpadam

వరంగల్ లో జర్నలిస్ట్ లకు 200 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు…మంత్రి కేటీఆర్ శంకుస్థాపన

Drukpadam

అమెరికాలో గుంటూరు యువతి మృతి…

Ram Narayana

Leave a Comment