ఆంధ్రప్రదేశ్

తెరుచుకోని విమానం తలుపులు.. కిటికీలోంచి కాక్‌పిట్‌లోకి దూరిన పైలట్

  • అమెరికాకు చెందిన సౌత్ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌లో వెలుగు చూసిన ఘటన
  • ప్రయాణికుడి కారణంగా విమానం తలుపులకు లోపలి నుంచి గడియ
  • మరోమార్గంలోకే కిటికీ లోంచి కాక్‌పిట్‌లోకి దూరి తలుపులు తెరిచిన పైలట్
  • ఘటన తాలూకు చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్

ప్రయాణికుడి తప్పిదం కారణంగా ఓ విమానం తలుపులు తెరుచుకోలేదు. దీంతో, పైలట్ విమానం కిటికీ లోంచి కాక్‌పిట్‌లోకి దూరి తలుపులు తెరవాల్సి వచ్చింది. కిటికీలోంచి పైలట్ లోపలికి దూరుతున్న దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మే 24న శాన్ డియేగో అంతర్జాతీయ విమానాశ్రయంలో నిలిపి ఉంచిన సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. 

అంతకుమునుపు ఆ విమానం నుంచి చివరిగా దిగిన ప్రయాణికుడి పొరపాటు కారణంగా విమానం తలుపులకు లోపలి నుంచి గొళ్లెం పడిపోయింది. దీంతో, వాటిని తెరవడం సిబ్బందికి సాధ్యపడలేదట. మరోమార్గం లేక పైలట్ కాక్‌పిట్ కిటికీలోంచి దూరి తలుపులు తెరిచాడట. పైలట్ నిబద్ధత కారణంగా విమానం షెడ్యూల్ ప్రకారం బయలుదేరిందని ప్రయాణికులు తెలిపారు.

Related posts

సర్పంచ్ అభ్యర్థులకు రాత పరీక్ష!

Drukpadam

పచ్చి మిరప, ఎండు మిరపలో ఏది ఎక్కువ మంచిది?

Ram Narayana

ఆర్టీసీ చార్జీల పెంపు…నేరంనాదికాదు కేంద్రానిది అంటున్న రాష్ట్రం..

Drukpadam