రాజకీయ వార్తలు

ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ పై జావేద్ ఆశలు…!

ఖమ్మం అసెంబ్లీ కాంగ్రెస్ టికెట్ పై జావేద్ ఆశలు…!
-చాపకింద నీరులా ప్రచారం
-సీఎల్పీ ,టీపీసీసీ వద్ద మంచి మార్కులు
-పార్టీ కోసం త్యాగానికైనా సిద్ధమంటున్న నేత
-పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకోని పోతున్న వైనం ..

మహమ్మద్ జావేద్ …ఖమ్మం నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ….మొదటినుంచి కాంగ్రెస్ విద్యార్ధి , యువజన సంఘాలలో పనిచేశారు . మంచి కమిట్ మెంట్ ఉన్న కార్యకర్తగా పేరు సంపాందించుకున్నారు…ఉన్నత విద్యావంతుడు …ప్రజలను ఆకట్టుకోవడంలో తనదైన శైలిలో పనిచేసున్నారు . ఖమ్మం నియోజకవర్గ ఇంచార్జి గా కొనసాగుతున్నారు . గత కొన్ని సంవత్సరాలుగా నియోజకవర్గాన్ని అంటిపెట్టుకొని తిరుగుతున్నారు . ఆయన ఇంచార్జి , నగర అధ్యక్షుడు అయినా తర్వాతనే పార్టీకి ఒక భరోసా వచ్చింది. కార్యకర్తల్లో ఒకడిగా కలిసి మెలిసి తిరుగుతున్నారు. తన సొంత డబ్బులను ఖర్చు పెట్టుకొని పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను జయప్రదం చేస్తున్నారు.

ఖమ్మం నియోజకవర్గానికి ఇంఛార్జిగా ఉండటంతో సహజంగానే తనకు టికెట్ వస్తుందనే ఆశతో ఉన్నారు . అయితే అందులో కూడా ఆయన సిన్సియార్టీ మెచ్చుకోవాల్సిందే …తనకన్నా మంచి అభ్యర్థి వస్తే తాను వెనక్కు తగ్గడానికి కూడా వెనుకాడనని అంటున్నారు. దటీస్ జావేద్ అంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు …నిత్యం ఎదో ఒక కార్యక్రమంలో పాల్గొనడం చేస్తున్నారు . కాంగ్రెస్ విధానాలను ప్రచారం చేస్తున్నారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని నమ్ముతున్నారు .

భట్టి పీపుల్స్ మార్చ్ లో కూడా జావేద్ పాత్ర కీలకంగానే ఉంది …నిరంతరం ఖమ్మం జిల్లా నుంచి తరుచు భట్టిని కలుస్తున్నారు . అనేక మందిని భట్టి మార్చ్ లో పాల్గొనేలా చేశారు . వివాద రహితుడిగా ఆయనకు పేరుంది . ఖమ్మం నియోజకవర్గానికి మంచి అభ్యర్థే అవవుతారు .అయితే కొందరు బిగ్ షాట్ లో కాంగ్రెస్ చేరే అవకాశం ఉన్నందున తనకు ఇస్తే చేస్తా లేకపోతె ఎవరిని పోటీ పెట్టిన వారి వెంటతిరిగి ప్రచారం చేస్తానని పార్టీ పై ఆయనకు ఉన్న లాయల్టీని ప్రదర్శిస్తున్నారు . ఇప్పటికే ఖమ్మం నియోజకవర్గంలోని అనేక గ్రామాలను తిరిగారు . వారితో సమావేశాల్లో పాల్గొన్నారు .పార్టీ కోసం పనిచేయాలని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు గలిగే ప్రయోజనాలను తెలియజేస్తున్నారు …పొంగులేటి కాంగ్రెస్ లో చేరితే ఖమ్మం నుంచి పోటీచేసే అవకాశం ఉందని అంటున్నారు .ఒక సందర్భంలో మాజీకేంద్ర మంత్రి రేణుక చౌదరి కూడా పోటీచేస్తారని ప్రచారం జరిగిన ఆమె అయిష్టత చూపుతున్నట్లు తెలుస్తుంది…..

Related posts

రాహుల్ గాంధీపై బీహార్‌లోనూ పరువునష్టం కేసు!

Drukpadam

గాంధీ కలలుగన్న స్వరాజ్యం ఇదేనా?: ఏపీ ప్రభుత్వంపై చంద్రబాబు ఫైర్!

Drukpadam

2024 ఎన్నికల్లో విపక్షాల ప్రధాని అభ్యర్థి రాహుల్ గాంధీ..! : కమల్ నాథ్

Drukpadam