ఆంధ్రప్రదేశ్

13 సంవత్సరాల హౌసింగ్ సొసైటీకి మంత్రి హరిష్ రావు చొరవతో మోక్షం..

2సొసైటీలకు డబ్బు చెల్లింపు అనుమతి ఇప్పిస్తా వరంగల్, మే 31: వరంగల్ నగరంలోని కాకతీయ ,ఏకశిల జర్నలిస్ట్ హౌసింగ్ కోఆపరేటివ్ సొసైటీలకు 2009 లో ప్రభుత్వం కేటాయించిన భూములకు డబ్బులు చెల్లించేందుకు రెవెన్యూ సెక్రెటరీ నవీన్ మిట్టల్ తో అనుమతి ఇప్పించి భూములను సొసైటీలకు అప్పగించేందుకు సహకరిస్తానని రాష్ట్ర ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి హరీష్ రావు చెప్పారు. బుధవారం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు ముందు కాకతీయ జర్నలిస్ట్ హౌసింగ్ కోపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు ఎం. రాజేంద్రప్రసాద్, ఏకశిలా జర్నలిస్టు హౌసింగ్ కోపరేటివ్ సొసైటీ కార్యదర్శి బి ఆర్ లెనిన్, అడ్వైజర్ కి అనిల్ కుమార్ మంత్రికి వినతి పత్రాలు సమర్పించారు… ప్రభుత్వం కేటాయించిన భూమికి డబ్బు చెల్లించేందుకు ప్రభుత్వ అనుమతి కోసం 13 సంవత్సరాలుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని, ఫైలు రెవెన్యూ సెక్రటరీ నవీన్ మిట్టల్ వద్ద పెండింగ్ ఉందని సొసైటీ బాధ్యులు వివరించారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ మంత్రి కి సొసైటీల సమస్యను వివరించారు. మంత్రి సొసైటీల సమస్య పరిష్కరించాలని రెవిన్యూ సెక్రెటరీ వాట్సాప్ లో పంపించారు.

Related posts

ప‌ద్మావ‌తి నిల‌యంలోనే శ్రీ బాలాజీ క‌లెక్ట‌రేట్‌..సుప్రీంకోర్టు

Drukpadam

మైలేజీ ఎందుకు తగ్గిందని ప్రశ్నించిన అధికారులు.. దుస్తులు విప్పేసి నిరసన వ్యక్తం చేసిన ఆర్టీసీ డ్రైవర్

Drukpadam

బుడమేరు గండ్లు పూడ్చేందుకు ఆర్మీని పిలుస్తున్నాం: కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్

Ram Narayana