Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఉచిత విద్యుత్ పై బీఆర్ యస్ ది గోబెల్స్ ప్రచారం …సీఎల్పీ నేత భట్టి

ఉచిత విద్యుత్‌పై కాంగ్రెస్‌కే పేటెంట్.. అది మా మానస పుత్రిక: భట్టి విక్రమార్క…

  • ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్న భట్టి
  • రేవంత్ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని మండిపాటు
  • రైతులకు మరింత నాణ్యమైన కరెంట్ ఇవ్వాలన్నదే తమ విధానమని వెల్లడి

తెలంగాణలో ఉచిత విద్యుత్‌పై బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టీపీసీసీ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదంపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. రేవంత్ వ్యాఖ్యలను బీఆర్ఎస్ వక్రీకరిస్తోందని మండిపడ్డారు. ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్‌ అని చెప్పారు.

‘‘ఉచిత విద్యుత్ అనేది కాంగ్రెస్ పేటెంట్.. అది మా మానసపుత్రిక. ఎవ్వరూ ఊహించని సమయంలో, ఆర్థిక పరమైన ఇబ్బందులున్నా.. నాడు కాంగ్రెస్ ఆ పథకాన్ని అమలు చేసింది. ఇప్పుడు ఎవరో వచ్చి ఉచిత కరెంటు ఇస్తున్నామని చెబితే.. అంతకన్నా హాస్యాస్పదం ఇంకొకటి ఉండదు” అని అన్నారు.
ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత కరెంట్ ఇవ్వాలన్నది తమ విధానమని చెప్పారు. రైతులకు మరింత నాణ్యమైన విద్యుత్‌ను అందించాలన్నదే తమ ఉద్దేశమని భట్టి తెలిపారు. త్వరలో ‘సెల్ఫీ విత్ జలయజ్ఞం’ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు వెల్లడించారు. తాము మొదలుపెట్టిన ప్రాజెక్టుల వద్దకు వెళ్లి.. సెల్ఫీ తీసుకుని, ఆ ప్రాజెక్టు సమగ్ర సమాచారాన్ని అందరికీ ఇస్తామని అన్నారు.

తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ అనేది పచ్చి అబద్ధం: కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి

  • రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు కరెంట్‌ ఇవ్వడం లేదన్న వెంకట్‌రెడ్డి
    ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని సవాల్
  • విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశారని మండిపాటు
MP Komati Reddy Venkat Reddy Open Challenge to Telangana Minister KTR

 

తెలంగాణ మంత్రి కేటీఆర్‌‌కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఓపెన్ చాలెంజ్ విసిరారు. రాష్ట్రంలో 11 గంటలకు మించి రైతులకు ఉచిత కరెంట్‌ ఇస్తున్నట్లు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానన్నారు. 24 గంటల ఉచిత కరెంటు అనేది పచ్చి అబద్ధమని మండపిడ్డారు.
గురువారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండలం బండ సోమారం గ్రామంలో విద్యుత్ సబ్ స్టేషన్ ను వెంకట్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. బండ సోమవారం సబ్ స్టేషన్ బుక్ లో అన్ని వివరాలు ఉన్నాయని తెలిపారు.బీఆర్ఎస్ వాళ్లు పని లేక ధర్నాలు చేశారని మండిపడ్డారు.
‘‘పది లేదా పదకొండు గంటలకు మించి రైతులకు కరెంట్ ఇవ్వడం లేదు. మధ్యలో కూడా పవర్ కట్ అవుతోంది. 24 గంటలు కరెంట్ అంటున్న కేటీఆర్ ను బండసోమవారం సబ్ స్టేషన్ నుంచే ప్రశ్నిస్తున్నా” అని అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సర్వ నాశనం చేశారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ్యవసాయానికి 11 గంటల కంటే ఎక్కువగా విద్యుత్ ఇస్తే రాజీనామాకు సిద్ధమని చెప్పారు.

Related posts

దోపిడీ పీడన ఉన్నంతకాలం ఎర్రజెండా ఉంటుంది..సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని…

Drukpadam

కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌పై మండిప‌డ్డ రేవంత్ రెడ్డి!

Drukpadam

పీఆర్సీ మోదం ఖేదం…

Drukpadam

Leave a Comment