Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

జగ్గుభాయ్‌ను ఇంటికి పంపే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్…

జగ్గుభాయ్‌ను ఇంటికి పంపే రోజు వచ్చింది: పవన్ కల్యాణ్…

  • జగన్ భాష చూస్తుంటే చిరాకేస్తోందన్న పవన్
  • ఆయన తన పెళ్లిళ్ల దగ్గరే ఆగిపోయారని సెటైర్
  • విప్లవకారుడు రాజకీయ నాయకుడైతే ఎలా ఉంటుందో చూపిస్తానని వ్యాఖ్య
జగన్ భాష చూస్తుంటే చిరాకేస్తోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తన వివాహాలకు సంబంధించి విడాకులు తీసుకున్నానని, కానీ జగన్ మాత్రం తన పెళ్లిళ్లను పట్టుకుని అక్కడే ఉన్నారని మండిపడ్డారు.
గురువారం తాడేపల్లిగూడెంలో జనసేన వీరమహిళలు, నాయకుల సమావేశంలో పవన్ మాట్లాడారు. తన ప్రసంగంలో ‘జగ్గూభాయ్’ అంటూ జగన్‌పై సెటైర్లు వేశారు. జగ్గుభాయ్‌ని ఇంటికి పంపే రోజు వచ్చిందని అన్నారు. విప్లవకారుడు రాజకీయ నాయకుడు అయితే ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పారు.
‘‘జగన్ పదే పదే పెళ్లాం పెళ్లాం అంటుంటే.. ఆ భాష చూస్తుంటే చిరాకేస్తోంది. నా భార్యను అంటే పట్టించుకోను. నన్ను, నా కుటుంబాన్ని అన్నా నాకు కోపం రాదు. ప్రజలను అంటే మాత్రం కోపం వస్తుంది. జనసేన కార్యకర్తను ఒక మహిళా సీఐ చెంప చెళ్లుమనిపించడం చాలా బాధేసింది” అని అన్నారు.

రాజకీయాల్లో ఎదురుదాడి చేయడం అలవాటు చేసుకోవాలని జనసేన అధినేత  పార్టీ శ్రేణులకు సూచించారు. మనం తప్పు చేయనప్పుడు దేనికీ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అద్భుతాలు చేయాలనే ఉద్దేశంతో తాను రాజకీయాల్లోకి రాలేదని… పేద ప్రజల బతుకులు మార్చాలనే వచ్చానని అన్నారు. సమాజంపై ప్రేమతో తన ప్రాణాన్ని, తన కుటుంబాన్ని పణంగా పెట్టి వచ్చానని చెప్పారు. 

వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను తాను కానీ, తన కుటుంబం కానీ ఎందుకు ఎదుర్కోవాలని ప్రశ్నించారు. రాష్ట్రంలో పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు కొత్తగా సచివాలయ వ్యవస్థ ఎందుకని నిలదీశారు. వైసీపీ నేతలు అంతులేని అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజల మాన ప్రాణాలకు భంగం కలిగిస్తే తన అభిమానినైనా శిక్షించాల్సిందేనని చెప్పారు. 

టీడీపీకి జనసేన బీటీమ్ అనే వ్యాఖ్యలపై స్పందిస్తూ… మన పార్టీవాళ్లే తొలుత సందేహిస్తున్నారని చెప్పారు. వైసీపీ వాళ్లు ఇలాంటి ఆరోపణలు చేయడం సహజమేనని, సొంత పార్టీ వాళ్లు కూడా సందేహించడం తనకు ఇబ్బందిగా ఉందని అన్నారు. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు.

Related posts

సాయి గణేష్ ప్రాణం తీసిన పాపం బిజెపి నాయకులదే.. టీఆర్ యస్ ఆరోపణ!

Drukpadam

నాటకీయ పరిణామాల మధ్య రాజీనామాను ఉపసంహరించుకున్న శరద్ పవార్…

Drukpadam

ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అన్ని పార్టీలు ఏకం కావాలి …కేజ్రీవాల్

Drukpadam

Leave a Comment