Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

హరీశ్, రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో కలకలం …

మంత్రి హరీశ్ రావును కలిసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్…

  • రాజాసింగ్ పై కొనసాగుతున్న బీజేపీ సస్పెన్షన్
  • పార్టీతో సంబంధం లేకుండా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రాజాసింగ్
  • ఆసక్తిని రేపుతున్న హరీశ్, రాజాసింగ్ భేటీ
  • తన చావు బీజేపీలోనే అన్న రాజా సింగ్

తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. రాజాసింగ్ పై సస్పెన్షన్ ను ఎత్తివేయాలని హైకమాండ్ కు బండి సంజయ్ పలు మార్లు లేఖలు రాసినా పార్టీ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాలేదు. 

మరోపక్క, ఇటీవలే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కిషన్ రెడ్డితో రాజాసింగ్ కు విభేదాలు ఉన్నాయని కూడా చెపుతున్నారు. ఈ నేపథ్యంలో హరీశ్ తో రాజాసింగ్ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కేవలం తన నియోజకవర్గ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని రాజాసింగ్ చెప్పారు. ఇతర విషయాల గురించి తాము చర్చించలేదని అన్నారు.

హరీశ్ రావును ఎందుకు కలిశారో చెప్పిన రాజాసింగ్

మంత్రి హరీశ్ రావుతో గోషామహల్ రాజాసింగ్ భేటీ అయిన విషయం రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో, రాజాసింగ్ పార్టీ మారుతున్నారా? అనే చర్చ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజాసింగ్ స్పందిస్తూ… తన నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని చెప్పారు. గోషామహల్ లో ఉన్న ఆసుపత్రిని 30 పడకలు లేదా 50 పడకలుగా అభివృద్ధి చేయాలని కోరానని తెలిపారు. ఆసుపత్రి అభివృద్ధి కోసం తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నానని చెప్పారు. తాను బీజేపీలోనే ఉంటానని, బీజేపీలోనే చస్తానని… తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని స్పష్టం చేశారు. హిందూ దేశం కోసం తన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.

Related posts

గాయత్రీ రవిని వరించిన అదృష్టం …  టీఆర్ యస్ రాజ్యసభ సీటు ఖరారు !

Drukpadam

ఆళ్ళ… షర్మిల వద్దకు జగన్ దూతగా వెళ్ళారా  …?

Drukpadam

ఏకంగా చెరువులోనే బిల్డింగ్ కట్టిన ఘనుడు.. బాంబులతో కూల్చేసిన అధికారులు

Ram Narayana

Leave a Comment