Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్..

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. హైదరాబాద్ కలెక్టర్‌గా అనుదీప్..

  • మర్రి చెనారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్ గా శశాంక్ గోయల్
  • క్రీడల డైరెక్టర్ గా కొర్రా లక్ష్మీ… జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా స్నేహ శబరీశ్
  • గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్

తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ అధికారుల బదిలీలు చోటు చేసుకున్నాయి. వెయిటింగ్‌లో ఉన్న పలువురు ఐఏఎస్‌ అధికారులకు ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 31 మంది ఐఏఎస్‌ అధికారులకు బదిలీలు, పోస్టింగ్ లు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

1990 బ్యాచ్‌కు చెందిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్ శశాంక్ గోయల్‌ను మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌ జనరల్‌గా, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ ముఖ్యకార్యదర్శిగా శైలజా రామయ్యర్, ఆయుష్ డైరెక్టర్‌గా దాసరి హరిచందన, కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిగా కృష్ణ ఆదిత్య లను నియమించారు. తెలంగాణ స్టేట్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంగీత సత్యనారాయణ, భద్రాచలం ఐటీడీఏ పీవోగా ప్రతీక్ జైన్, సెర్ప్ సీఈవోగా గౌతమ్, గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా నవీన్ నికోలస్, నిజామాబాద్ మున్సిపల్‌ కమిషనర్‌గా మంద మకరందు, ఆర్థిక శాఖ సంయుక్త కార్యదర్శిగా హరితను నియమించారు.

హస్త కళల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా అలగు వర్షిణి, క్రీడల డైరెక్టర్ గా కొర్రా లక్ష్మీ, ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ డైరెక్టర్ గా హైమావతి, పర్యాటక శాఖ డైరెక్టర్ గా నిఖిల, వ్యవసాయ శాఖ ఉప కార్యదర్శిగా సత్య శారదాదేవి నియమితులయ్యారు. జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ గా స్నేహ శబరీశ్ నియమితులయ్యారు.

హైదరాబాద్ కలెక్టర్ గా అనుదీప్ దురిశెట్టి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గా ప్రియాంక ఆల, ములుగు కలెక్టర్‌గా ఐలా త్రిపాఠి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్‌గా ముజమిల్‌ ఖాన్‌ నియమితులయ్యారు. వెంకటేశ్ ధోత్రేను మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ గా నియమించారు.

Related posts

స్వలాభం కోసమే కందాల పార్టీ మారారు…కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ కో .చైర్మన్ పొంగులేటి

Ram Narayana

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై జాతీయ పార్టీల ద్రుష్టి…!

Drukpadam

తెలంగాణ కొత్త డీజీపీగా రవి గుప్తా

Ram Narayana

Leave a Comment