Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి హరీష్ రావుతో కలసి సంతోష్ రెడ్డికి పరామర్శ

ఎంపీ వద్దిరాజు మాజీ మంత్రి హరీష్ రావుతో కలసి సంతోష్ రెడ్డికి పరామర్శ

కాంగ్రెస్ గుండాల దాడిలో తీవ్రంగా గాయడిన సురారం సంతోష్ రెడ్డిని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుతో కలసి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర పరామర్శించారు

వరదల వల్ల తీవ్రంగా నష్టపోయిన బాధితులను పరామర్శించేందుకు హరీష్ రావు వెంట బీఆర్ఎస్ నాయకుడు సంతోష్ రెడ్డి ఖమ్మం వచ్చారు

ఖమ్మం నగరంలోని బొక్కలగడ్డ వద్ద వరద బాధితులను పరామర్శిస్తున్న సందర్భంగా కాంగ్రెస్ గుండాలు రాళ్లతో దాడికి దిగడంతో సంతోష్ తీవ్రంగా గాయపడ్డారు

హరీష్ రావు ఆయన్ను వెంటనే మమత ఆస్పత్రిలో చేర్పించారు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్ రెడ్డిని హరీష్ రావుతో కలసి ఎంపీ రవిచంద్ర, మాజీ మంత్రి జగదీష్ రెడ్డిలు పరామర్శించారు. ఈ సందర్భంగా హరీష్ రావు వెంట ఎమ్మెల్సీలు రవీందర్ రావు,శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు కే.పీ.వివేకానంద,పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య ,బానోతు మదన్ లాల్ తదితర ప్రముఖులు ఉన్నారు. సంతోష్ రెడ్డికి మరింత మెరుగైన వైద్యం అందించేందుకు హైదరాబాద్ తరలించే ఏర్పాట్లు చేయాల్సిందిగా హరీష్ రావు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ రవిచంద్రలను కోరారు

Related posts

అడ్డగోలు అవినీతి …ఆపై కటకటాలపాలు…

Ram Narayana

సి జె ఐ డీవై చంద్రచూడ్‌ తో సీఎం రేవంత్ రెడ్డి మర్యాదపూర్వక భేటీ …!

Ram Narayana

చేతిలో ఓటరు లిస్ట్.. జేబులో డబ్బుల కట్టలు..

Ram Narayana

Leave a Comment