Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నారు: భట్టి

ఏదో అద్భుతం జరుగుతున్నట్టు కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నారు: మల్లు భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని వనరులను బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారన్న భట్టి విక్రమార్క
ధరణి పోర్టల్ ఒక మహమ్మారిలా తయారయిందని విమర్శ
కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని వ్యాఖ్య

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. గత తొమ్మిదేళ్లుగా బీఆర్ఎస్ పాలనలో ఏదో అద్భుతం జరుగుతున్నట్టుగా కేసీఆర్ భ్రమలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని వనరులను బీఆర్ఎస్ నేతలు దోచుకుంటున్నారని విమర్శించారు.

కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రాష్ట్ర ప్రజల పాలిట ఒక మహమ్మారిలా తయారయిందని అన్నారు. ధరణి పేరుతో తమ భూములను తమకు కాకుండా చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ కు పట్టం కట్టాలని నిరుద్యోగ యువత కోరుకుంటోందని చెప్పారు. బెల్టు షాపులను మూయించాలని ప్రజలు కాంగ్రెస్ ను కోరుతున్నారని అన్నారు.

Related posts

రూ.100 కోట్లు ఇస్తే మంత్రి పదవి అంటూ ఆఫర్.. మహారాష్ట్రలో నలుగురి అరెస్ట్!

Drukpadam

సీఎం గారూ… రేపటి మీ ఢిల్లీ యాత్ర దేనికి స్వామి :వర్ల

Drukpadam

సహారా, ఈఎస్ఐ కేసుల్లో కేసీఆర్ పాత్ర కేసీఆర్ జైలుకు వెళ్లకతప్పదు …బండి సంజయ్

Drukpadam

Leave a Comment