Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

చిరుతను బంధించిన యువకుడు …వీరుడు అంతే ఇతనే అంటున్న ప్రజలు ..

వీరుడంటే ఇతనే.. దాడి చేసిన చిరుతను బైక్ మీద బంధించి తీసుకెళ్లి ఫారెస్ట్ అధికారులకు ఇచ్చేశాడు..!

  • కర్ణాటకలోని హసన్ జిల్లాలో ఘటన
  • తనపై దాడికి ప్రయత్నించిన చిరుతతో పోరాడిన యువకుడు
  • కాళ్లను తాడుతో బంధించి అటవీ అధికారులకు అప్పగించిన ధైర్యశాలి

చిరుత పులిని చూస్తేనే భయం పట్టుకుంది. అది దగ్గరకు వచ్చిందంటే భయంతో చెమటలు పట్టేస్తాయి. అది మనపై దాడి చేసిందా ఇక అంతే సంగతులు. కానీ, తనపై దాడి చేసిన చిరుత పులిని బంధించిన ఓ యువకుడు  బైక్ మీద తీసుకెళ్లి అటవీశాఖ అధికారులకు అప్పగించాడు. కర్ణాటకలో జరిగిందీ సంఘటన. కర్ణాటక హాసన్ జిల్లాలోని అరసీకెరె తాలూకా గండాసి హోబ్లీ బాగివాలు గ్రామానికి చెందిన వేణుగోపాల్ అలియాస్ ముత్తు అనే యువకుడు శుక్రవారం ఉదయం పొలానికి వెళ్తుండగా చిరుతపులి దాడి చేసింది. ఆ యువకుడు ధైర్యం చేసి చిరుతతో పోరాడాడు.

తప్పించుకొని వెళ్తున్న దాన్ని బైక్‌తో వెంబడించి మరీ పట్టుకున్నాడు. తన దెబ్బకు స్పృహ కోల్పోయిన చిరుత నాలుగు కాళ్లను తాడుతో చుట్టి బంధించాడు. బెక్ వెనకాల వేసుకొని వెళ్లి అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు. అటవీశాఖ సిబ్బంది చిరుతకు చికిత్స చేయించారు. ఆ యువకుడు చిరుతను బైక్ పై కట్టి తీసుకెళ్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సదరు యువకుడి ధైర్య సాహసాలను అందరూ మెచ్చుకుంటున్నారు.

Related posts

ఇప్పటి వరకు 6.50 కోట్లకు పైగా ఐటీ రిటర్న్స్ దాఖలు

Ram Narayana

భారత్‌ను ఆర్థిక సూపర్ పవర్‌గా మార్చేందుకు ప్రధాని మోదీ,అదానీ, అంబానీల కృషి!సీఎన్ఎన్ రిపోర్ట్

Ram Narayana

హత్యాచారం కేసును రాజకీయం చేయకండి: కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు హితవు!

Ram Narayana

Leave a Comment