Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

జ్ఞానవాపి మసీదులో మొదలైన సర్వే..సుప్రీం స్టే

జ్ఞానవాపి మసీదులో మొదలైన సర్వే..సుప్రీం స్టే
సుప్రీంకోర్టుకు ఆశ్రహించిన మసీదు నిర్వహణ కమిటీ
జిల్లా కోర్టు ఆదేశాలతో ఈ ఉదయం సర్వే ప్రారంభించిన 30 మంది అధికారులు
సర్వే సుప్రీంకోర్టు గత ఆదేశాలకు విరుద్ధమంటున్న ముస్లిం కమిటీ
అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి
స్పందినచిన అత్యన్నతో న్యాయస్థానం

వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సర్వే ప్రారంభమైన కొద్దీ సేపటికే సుప్రీం స్టే విధించింది . ఉదయం 30 మంది సభ్యులతో కూడిన అధికారుల బృందం సర్వే చేపట్టింది .అత్యంత భద్రతా మధ్య ప్రారంభమైన కొద్దీ సేపటికే మసీద్ నిర్వహణ కమిటీ సుప్రీం ను ఆశ్రహించగా పురావస్తు శాఖ సర్వే నిలిపి వేయాలని ఆదేశాలు జారీచేసింది.

ఉత్తర ప్రదేశ్ లోని పురాతన నగరమైన కాశీలో మందిర్ ,మసీద్ వివాదం ప్రారంభమైంది …మందిరంపై మసీద్ నిర్మించారని హిందూ సంఘాలు ఎప్పటినుంచో ఆరోపణలు చేస్తున్నాయి. దీనిపై కోర్టుల చుట్టూ తిరిగి విసిగి వేసారిన ప్రజలు మళ్ళీ కోర్ట్ తలుపులు తట్టారు .దీంతో నిజగంగా మందిర్ పై మసీద్ నిర్మించారా…? లేదా అనే విషయాన్నీ నిర్దారించాలని భారత పురావస్తు శాఖకు జిల్లా కోర్ట్ ఆదేశాలు జారీచేసింది…

దీంతో సోమవారం వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) సర్వే ప్రారంభమైంది. ఉదయం 30 మంది సభ్యులతో కూడిన అధికారుల బృందం సర్వే చేబట్టింది. ఒకప్పటి హిందూ ఆలయంపై ఈ మసీదు నిర్మించారా అన్న విషయాన్ని వీరు నిర్ధారించనున్నారు. మరోవైపు వారణాసిలోని నిర్మాణ ప్రాంగణంలో ఈ సర్వేపై స్టే విధించాలని కోరుతూ జ్ఞానవాపి మసీదు నిర్వహణ కమిటీ సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సర్వే అంశాన్ని గతంలో సుప్రీంకోర్టు వాయిదా వేసిందన్న విషయాన్ని ఆపిటిషన్‌లో పేర్కొంది.

మొత్తం ప్రాంగణంలోని తవ్వకాలతో సహా సర్వే కోసం ఆదేశించడం వల్ల మసీదులోకి ముస్లింల ప్రవేశానికి ఆటంకం కలుగుతుందని, సుప్రీంకోర్టు విచారిస్తున్న సమయంలో జిల్లా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకు, స్ఫూర్తికి విరుద్ధమని మసీద్ నిర్వహణ కమిటీ పేర్కొన్నది . తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కూడా కోరింది. జ్ఞానవాపి మసీదులో హిందూ దేవతల విగ్రహాలను పూజించే హక్కు ఐదుగురు హిందూ మహిళలకు ఉందంటూ అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఈ కమిటీ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. కాగా, సర్వేకు సంబంధించి ఆగస్టు 4 నాటికల్లా సంబంధిత వీడియోలను, ఫొటోలతో ఓ నివేదికను సమర్పించాలని గతవారం జిల్లా కోర్టు పురావస్తు శాఖను ఆదేశించిన సంగతి తెలిసిందే ….!

Related posts

ముఖంపై కొట్టాడు.. గుండెల్లో గుద్దాడు.. పొత్తికడుపులో తన్నాడు: స్వాతి మలివాల్

Ram Narayana

జీ20 సదస్సు: రాష్ట్రపతి విందుకు హాజరైన ప్రతిపక్ష సీఎంలు వీరే..!

Ram Narayana

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాఫిక్ జామ్… 300 కి.మీ. మేర నిలిచిన వాహనాలు!

Ram Narayana

Leave a Comment