Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!

కేసీఆర్ పాలన మోసం దగా…420 కేసు పెట్టాలి…పొంగులేటి సుధాకర్ రెడ్డి ..!
డబుల్ బెడ్ రూమ్ ల విషయంలో వైఫల్యం
దళిత బంధు లో అవినీతి
కేంద్ర పథకాలను కానరాకుండా చేస్తున్న కేసీఆర్
రాజ్యాంగ ఉల్లంఘన చర్యలపై చర్యలు తీసుకోవాలి
ఖమ్మం పాత కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా

కేసీఆర్ మోసపూరిత వాగ్దానాలపై బీజేపీ సమరశంఖం పూరించింది. కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను , మోసపూరిత వాగ్దానాలను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఖమ్మం పాత కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నావర్షాన్ని సైతం లెక్క చేయకుండా ధర్నా నిర్వహించింది. ఈసందర్భంగా బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు పార్టీ సహా ఇంచార్జి డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మోసపు మాటలు దగా కోరు విధానంపై 420 కేసు పెట్టాలని డిమాండ్ చేశారు . ప్రజలు మాయమాటలు చెప్పి రెండవసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు . డబుల్ బెడ్ రూమ్ పథకం వైఫల్యం చెందిందని వాటిలో అవినీతిపై విచారణ జరిపి భాద్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు . దళిత బంధు పేరుతో ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని ఆలిస్టు నాదగ్గర ఉందని చెప్పిన కేసీఆర్ ఎంతమందిపై చర్యలు తీసుకున్నారో చెప్పాలన్నారు . నిరుద్యోగ సమస్య పరిస్కారం కాలేదని , నీటి ప్రాజక్టుల పేరుతో అవినీతికి పాల్పడ్డారని , లిక్కర్ కేసులో కేసీఆర్ కూతురు ఇరుక్కున్న విషయం మరుగున పరిచేందుకు ప్రయత్నిస్తున్నారని కేసీఆర్ చర్యలపై పొంగులేటి ధ్వజమెత్తారు . రైతులు రుణమాఫీ చేయలేదు …దళిత బంధు పేరుతో ప్రచారం ఎక్కువ చేసుకుంటూ అవినీతిని ప్రోత్సహిస్తున్నారని ,ధరణి పేరుతో పేదల భూములను కాజేస్తున్నారని ,కేంద్రం పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం నీతిమాలిన చర్య అని కేసీఆర్ పై తనదైన శైలిలో దుమ్మెత్తి పోశారు .

తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం …

కేసీఆర్ మోసాలను గ్రహించిన ప్రజలు ఈసారి ఎన్నికల్లో ఆయన్ను ఇంటికి పంపడానికి సిద్ధమైయ్యారని మోడీ నాయకత్వం ప్రజలు కోరుకుంటున్నారని తెలంగాణాలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు . దేశంలోనే గాక ప్రపంచంలో మోడీకి వివిధ దేశాలు నేతలు బ్రహ్మరథం పడుతున్నారని కొనియాడారు . ఫసల్ బీమా యోజన , ఆత్మనిర్బర్ లాంటి కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేయాలనీ తమ పార్టీ కార్యకర్తలను కోరారు …ఈ ధర్నా కార్యక్రమంలో కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు…

Related posts

On welfare measures of journalists After January 15 High level meeting

Ram Narayana

గంటా పయనమెటు …

Drukpadam

యాదవులను క్షమాపణలు కోరిన సీపీఐ నారాయణ!

Drukpadam

Leave a Comment