కమల్ హాసన్ పై నమ్మకం మాములుగా లేదు …!
కళ్లు చెదిరే భారీ ధరకు కమలహాసన్ ఇండియన్-2 డిజిటల్ రైట్స్
శంకర్ దర్శకత్వంలో భారతీయుడు చిత్రానికి సీక్వెల్
కమల్ కెరీర్ లో మరో భారీ చిత్రం
నెట్ ఫ్లిక్స్ కు ఇండియన్-2 డిజిటల్ హక్కులు!
దాదాపు రూ.200 కోట్లకు డీల్!
కమల్ హాసన్ అనేక తమిళ ,తెలుగు ,మలయాళం ,కన్నడ చిత్రాల్లో ,హిందీ చిత్రాల్లో అంటించిన ఈ అగ్రహీరో సిమిమాలు అంటే ప్రజలు ఆసక్తి చూపిస్తారు …ఒక ఆకలి రాజ్యం , ద్రోహి ,16 ఏళ్ళ వయసు ,భారతీయుడు , దశావతారాలు ,లాంటి హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు .భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తున్నా చిత్రం డిజిటల్ హక్కులు పొందేందుకు నెట్ ఫ్లిక్స్ 200 కోట్ల రూపాయలు చెల్లించేందుకు సిద్ధమైందని టాక్ …
శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ నటిస్తున్న ఇండియన్-2 సినిమా వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. శంకర్ పనితీరు పట్ల పూర్తి సంతృప్తితో ఉన్న కమల్ ఇటీవల ఆయనకు రూ.8 లక్షల విలువైన వాచీని గిఫ్టుగా ఇచ్చినట్టు తెలుస్తోంది.
కాగా, ఇండియన్-2 చిత్రానికి సంబంధించి తాజా సమాచారం తెరపైకి వచ్చింది. ఈ పాన్ ఇండియా చిత్రం డిజిటల్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడైనట్టు ట్రేడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఇండియన్-2 డిజిటల్ రైట్స్ దాదాపు రూ.200 కోట్లకు నెట్ ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.
లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ బ్యానర్లపై సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ ఇండియన్-2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, ఎస్జే సూర్య, సముద్రఖని, బాబీ సింహా తదితరులు నటిస్తున్నారు.