Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు యాత్రలా …సిగ్గుచేటు …సీఎల్పీ నేత భట్టి…

రాష్ట్రంలో ప్రజలు వరదలతో అల్లాడుతుంటే సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు యాత్రలా …సిగ్గుచేటు …సీఎల్పీ నేత భట్టి
ఇక్కడ ప్రజలు వరదల్లో చిక్కునోని చస్తుంటే …పక్కరాష్ట్రాల వారికీ విమానాలు పంపించి పార్టీలో చేర్చుకోవడం కేసీఆర్ కె చెల్లింది ..
అధికార యంత్రాంగాన్ని కేసీఆర్ ప్రజల అవసరాలకోసం కాకుండా రాజకీయ అవసరాలకోసమే వినియోగించడం దారుణం…
ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది …
ప్రాజక్టుల వార్షిక నిర్వహణ లేకపోవడంతో ఇబ్బందులు
కాళేశ్వరం , సీతారామ ప్రాజక్టులు అశాస్త్రీయమైనవి …
ఆర్టీసీ ని ప్రభుత్వం లో విలీనం చేయడం కాంగ్రెస్ విజయం…
ఆర్టీసీ ఆస్తులు అమ్మాలని చేస్తే కాంగ్రెస్ చూస్తూ ఊరుకోదు …

రాష్ట్రంలో వరదలతో ప్రజలు అల్లాడిపోతున్న బాధితులను ఏజెన్సీ ప్రాంతాలను సందర్శించకుండా సీఎం కేసీఆర్ మహారాష్ట్ర టూర్ కి వెళ్లడం సిగ్గు చేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు … భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్రంలో వరదలు, భారీ వర్షాలతో నష్టపోయిన పరిస్థితులను రాజ్ భవన్ లో గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ కు వివరించిన టిపిసిసి బృందం వరద బాధితులకు నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్ కు వినతిపత్రం ఇచ్చారు …అనంతరం రాజభవన ఎదుట మీడియాతో మాట్లాడారు … ఈసందర్భంగా కేసీఆర్ వైఖరిపై భట్టి తీవ్ర విమర్శలు గుప్పించారు …. రాష్ట్రాన్ని బాగా పాలిస్తావని నిన్ను నమ్మి ఓట్లు వేసి గెలిపిస్తే వరదల్లో చిక్కుకొని అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటే వారిని పరామర్శించే తీరిక లేదా సీఎం గారు అంటూ ప్రశ్నించారు .. మోరంచపల్లిలో అకస్మాత్తుగా వచ్చిన వరదలకు ప్రజలు కట్టుబట్టలతో అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని బిక్కు బిక్కు మంటుంటే వారిని పరామర్శించి ఓదార్చి ప్రభుత్వం తరుపున తక్షణ సహాయం అందించాల్సింది పోయి రాజకీయ పర్యటనలు చేస్తావా …రాష్ట్రం ప్రజలు ఏమైపోయినా ఫర్వాలేదని అనుకున్నావా …? మహారాష్ట్ర కు విమానాలు పంపించి ప్రగతి భవనంలో కూర్చొని వచ్చినవారికి కండలు కప్పుతావా …? అని భట్టి కేసీఆర్ చర్యలను తూర్పార భట్టరు . ఇక ప్రాజక్టుల విషయంలో వార్షిక నిర్వాణకు నిధులు కేటాయించకుండా సమీక్షలు జరపకుండా వదిలేస్తే వచ్చే నష్టాలు ప్రజల పాలిట శాపాలుగా మారుతున్నాయని దుయ్యబట్టారు . భారీ వర్షాలు , వరదల సమయంలో ప్రజలను రక్షించడానికి సహాయం చేయడానికి ఉపయోగించాల్సిన అధికారులను రాజకీయాలకు ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో కేసీఆర్ చెప్పాలని భట్టి డిమాండ్ చేశారు ..కాలేశ్వరం, సీతారామ ప్రాజెక్టులు నిర్మాణం ఆశాస్త్రీయంగా జరగడం వల్ల అనేక ప్రాంతాలు గిరిజన గూడేలు ముంపునకు గురైయ్యాయని గోదావరి పరివాహక ప్రాంతమంతా వందలాది గిరిజన గ్రామాలు ముంపుకు గురై అమాయక గిరిజనులు నిలువ నిద్రలేకుండా ఉంటె వారి ఆర్తనాదాలు ప్రభుత్వం పట్టించుకోదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు .మున్నేరు, కెన్నెరసాని నదులపై నిర్మించిన చెక్ డ్యాములు ఇంజనీరింగ్ అధికారులతో శాస్త్రీయంగా డిజైన్ చేసి నిర్మాణం చేసి ఉంటే నష్టం జరిగి ఉండేది కాదన్నారు .

భద్రాచలం నుంచి ఆదిలాబాద్ వరకు ఏజెన్సీ గిరిజన గూడేలు, పరిసర ప్రాంతాలు గోదావరి వరదలతో నీట మునిగే ముప్పు పొంచి ఉందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీతక్క, పోదేం వీరయ్య, దుద్దిల్ల శ్రీధర్ బాబులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసి రెస్క్యూ టీమ్లను పంపించాలని కోరినప్పటికీ కేసీఆర్ పెడచెవిన పెట్టారని విమర్శించారు .ప్రజల సంక్షేమం వదిలి రాజకీయాలు చేస్తున్న కేసీఆర్ ను ఎంత త్వరగా సాగనంపితే ప్రజలకు అంత మంచిదని భట్టి అన్నారు .

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం కాంగ్రెస్ పార్టీ విజయం

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరినప్పుడు సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా దుర్భషలాడుతూ నీతిమాలిన, పనికిమాలిన, ఆలోచన లేని నాయకులంటూ తమను తప్పు పట్టిన విషయాన్నీ గుర్తు చేశారు .
2023 -24 లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఆ భయంతోనే కేసీఆర్ విలీన నిర్ణయం తీసుకున్నారన్నారు .

ఆర్టీసీకి ఆస్తులు కూడా పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం

ఆర్టీసీ ఆస్తులు రాష్ట్ర ప్రజల ఆస్తులు… కాంగ్రెస్ ప్రభుత్వ హాయాంలో కూడపెట్టిన ఆర్టీసీ ఆస్తులను బిఆర్ఎస్ ప్రభుత్వం కొల్లగొట్టడానికి చూస్తే రోడ్లపైకి వస్తాము ఆర్టీసీ ఆస్తుల సంరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ వెనకాడదని అన్నారు .

1978 సంవత్సరంలో మర్రి చెన్నారెడ్డి నాయకత్వంలో ఇందిరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో ఇంటికో దీపం- ఊరికో బస్సు నినాదంతో ఊరూరికి బస్సు వేయించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని భట్టి అన్నారు .

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి తదితరులు.

Related posts

వామ్మో పెట్రోల్ @100 క్రాస్ అవుతుందా …

Drukpadam

తాగుబోతుల రాష్ట్రంగా తెలంగాణ :బీజేపీ ఎంపీ లక్ష్మణ్ !

Drukpadam

కాంగ్రెస్ పార్టీకి ధైర్యవంతులు కావాలి పిరికి వాళ్ళు కాదు ….రాహుల్ స్ట్రాంగ్ వార్నింగ్!

Drukpadam

Leave a Comment