Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలురాజకీయ వార్తలు

78 మంది పేర్లతో చక్కర్లు కొడుతున్న బీఆర్ యస్ అభ్యర్థుల జాబితా…

చక్కర్లు కొడుతున్న బీఆర్ యస్ అభ్యర్థుల జాబితా
మరికొన్ని సీట్లపై కసరత్తు …
కొందరిని మార్చే అవకాశం ఉందని ప్రచారం ..

బీఆర్ యస్ పార్టీ ఎన్నికలకు అన్నిరకాలుగా సిద్ధమైంది…ఆర్నెల్ల ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఎన్నికలకు మరో మూడు నెలల సమయం మాత్రమే ఉండటం, వచ్చే నెల చివరిలో ఎన్నికల షడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపిక పై ఫోకస్ పెట్టారు . దాదాపు 119 నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ఒకేసారి ప్రకటించాలని కేసీఆర్ భావించినప్పటికీ , కొంమందిని మార్చకపోతే నష్టం జరుగుతుందని సర్వేలు , ఇంటలిజన్స్ నివేదికలు రావడం జిల్లాలో అభ్యర్థుల విషయంపై స్థానిక నేతలతో ఆరా తీయడంద్వారా ఒక అంచనాకు వచ్చారు కేసీఆర్ …దీంతో ప్రస్తుతం ఎలాంటి శషభిషలు లేని 78 నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపిక పూర్తీ అయిందని ఈనెల 17 లేదా ఆతర్వాత ఎప్పుడైనా బీఆర్ యస్ అభ్యుర్థులను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం …జిల్లాల వారీగా అభ్యర్థుల వివరాలు క్రింది విధంగా ఉన్నాయి… వీటిలో మార్పులు ఉండక పోవచ్చునని బీఆర్ యస్ వర్గాలు అంటున్నాయి. కేసీఆర్ అనేకసార్లు సిట్టింగ్ అభ్యర్థలను మార్చబోమని చెప్పిన కొందరిని మార్చకపోతే ఇబ్బందులు తప్పవని సమాచారం ఉండటంతో ప్రత్యాన్మాయ ఆలోచలను చేస్తున్నారని అంటున్నారు … మొత్తం 119 నియోజకవర్గాలకు 78 మంది అభ్యర్థులు ఫైనల్ అయితే మరో 41 నియోజకవర్గాలకు అభ్యర్థుల కోసం కసరత్తు జరుగుతుంది…

78 మంది బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా…?

ఉమ్మడి అదిలాబాద్ – 7/10

సిర్పూర్ – కోనేరు కొనప్ప
చెన్నూరు – బాల్క సుమన్
ఆసిఫాబాద్ – అత్రం సక్కు
అదిలాబాద్ – జోగు రామన్న
బోథ్ – రాథోడ్ బాపు రావు
నిర్మల్ – ఇంద్రకరణ్ రెడ్డి
ముదోల్ – విఠల్ రెడ్డి

ఉమ్మడి నిజామాబాద్ – 8/9

ఆర్మూర్ – జీవన్ రెడ్డి
బోధన్ – షకీల్ అహ్మద్
జుక్కల్ – హనుమంత్ షిండే
బాన్సువాడ – పోచారం శ్రీనివాస్ రెడ్డి
ఎల్లారెడ్డి – జాజుల సురేందర్
నిజామాబాద్ అర్బన్ – గణేష్ బిగాల
నిజామాబాద్ రూరల్ – బాజిరెడ్డి గోవర్ధన్
బాల్కొండ – వేముల ప్రశాంత్ రెడ్డి

కరీంనగర్ – 8/13

కోరుట్ల – కల్వకుంట్ల విద్యాసాగర్ రావు/సంజీవ్
జగిత్యాల – సంజయ్
మంథని – పుట్ట మధు
కరీంనగర్ – గంగుల కమలాకర్
సిరిసిల్ల – కేటీఆర్
మానకొండూరు – రసమయి బాలకిషన్
హుస్నాబాద్ – వొడితెల సతీష్ కుమార్
రామగుండం – కొరుకంటి చందర్

ఉమ్మడి మెదక్ – 6/10

సిద్దిపేట – తన్నీరు హరీష్ రావు
నారాయణఖేడ్ – ఎం భూపాల్ రెడ్డి
నర్సాపూర్ – చిలుముల మదన్ రెడ్డి
పఠాన్ చెరు – గూడెం మహిపాల్ రెడ్డి
దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి
గజ్వేల్ – కేసీఆర్

ఉమ్మడి రంగారెడ్డి – 12/14

మేడ్చల్ – చామకూర మల్లారెడ్డి
మల్కాజ్ గిరి – మైనంపల్లి హన్మంతరావు
కుత్బుల్లాపూర్ – కేపీ వివేకానంద
కూకట్ పల్లి – మాధవరం కృష్ణారావు
ఇబ్రహీంపట్నం – మంచిరెడ్డి కిషన్ రెడ్డి
ఎల్బి నగర్ – దేవిరెడ్డి సుదీర్ రెడ్డి
మహేశ్వరం – సబితా ఇంద్రారెడ్డి
రాజేంద్ర నగర్ – ప్రకాష్ రెడ్డి
శేరిలింగంపల్లి – అరికేపుడి గాంధీ
చేవెళ్ల – కాలె యాదయ్య
వికారాబాద్ – మెతుకు ఆనంద్
తాండూర్ – పైలట్ రోహిత్ రెడ్డి

ఉమ్మడి హైదరాబాద్ – 6/15

ముషీరాబాద్ – ముఠా గోపాల్
అంబర్ పేట – కాలేరు వెంకటేష్
ఖైరతాబాద్ – దానం నాగేందర్
జూబ్లీహిల్స్ – మాగంటి గోపీనాథ్
సనత్ నగర్ – తలసాని శ్రీనివాస్ యాదవ్
సికింద్రాబాద్ – టి పద్మారావు

ఉమ్మడి మహబూబ్ నగర్ – 10/14

కొడంగల్ – పట్నం నరేందర్
నారాయణ్ పేట్ – ఎస్ రాజేందర్ రెడ్డి
మహబూబ్ నగర్ – వి శ్రీనివాస్ గౌడ్
జడ్చర్ల – సి లక్ష్మారెడ్డి
దేవరకద్ర – అల వెంకటేశ్వర రెడ్డి
మక్తల్ – చిట్టెం రామ్మోహన్ రెడ్డి
వనపర్తి – సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
గద్వాల్ – బండ్ల కృష్ణమోహన్
నాగర్ కర్నూల్ – మర్రి జనార్దన్ రెడ్డి
కొల్లాపూర్ – బీరం హర్షవర్ధన్

ఉమ్మడి నల్లగొండ – 10/12

దేవరకొండ – రమావత్ రవీంద్ర కుమార్
మిర్యలగూడ – నల్లమోతు భాస్కర్ రావు
హుజూరబాద్ – శానంపుడి సైదిరెడ్డి
సూర్యాపేట – జి జగదీష్ రెడ్డి
నల్గొండ – కంచర్ల భూపాల్ రెడ్డి
భువనగిరి – పైలా శేఖర్ రెడ్డి
నకిరేకల్ – చిరుమర్తి లింగయ్య
తుంగతుర్తి – గాదరి కిషోర్
ఆలేరు – గొంగడి సునీత
మునుగోడు – కోసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి

ఉమ్మడి వరంగల్ – 6/12

పాలకుర్తి – ఎర్రబెల్లి దయాకర్ రావు
నర్సంపేట – పెడ్డి సుదర్శన్ రెడ్డి
పరకాల – చల్లా ధర్మారెడ్డి
వరంగల్ పశ్చిమ – దాస్యం వినయ్ భాస్కర్
వర్ధన్నపేట – ఆరూరి రమేష్
భూపాల్ పల్లీ – గండ్ర వెంకటరమణారెడ్డి

ఉమ్మడి ఖమ్మం – 5/10

పినపాక – రేగ కాంతారావు
ఇల్లందు – బానోత్ హరిప్రియ
ఖమ్మం – పువ్వాడ అజయ్ కుమార్
సత్తుపల్లి – సండ్ర వెంకటవీరయ్య
అశ్వారావుపేట – మెచ్చా నాగేశ్వర రావు

Related posts

కేసీఆర్ తంత్రం :హుజురాబాద్ పై నజర్…

Drukpadam

కొడవళ్ళతో దోస్తీ… గులాబీ లో కలవరం ….

Drukpadam

ఆంధ్రాలో ఉండే వాళ్ళంతా రాక్షసులే అన్నదానిపై మంత్రి ప్రశాంత్ రెడ్డి వివరణ….

Drukpadam

Leave a Comment