Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

 పవన్ కళ్యాణ్ , నారా బ్రాహ్మణి లపై ఒక రేంజ్ లో ఫైర్ అయిన మంత్రి రోజా …!

సీఎం జగన్ ను అనేంతటివాడివా… ముందు నీ బతుకేంటో చూసుకో!: పవన్ కల్యాణ్ పై రోజా ఫైర్

  • నిన్న మంగళగిరిలో జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశం
  • నువ్వెంత, నీ బతుకెంత అంటూ సీఎం జగన్ పై పవన్ తీవ్ర వ్యాఖ్యలు
  • కనీసం వార్డు మెంబర్ గానైనా గెలిచావా అంటూ రోజా వ్యంగ్యం
  • జగన్ కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చి ఏంచేశావని ప్రశ్నించిన వైనం

జనసేనాని పవన్ కల్యాణ్ నిన్న మంగళగిరిలో పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ ను లక్ష్యంగా చేసుకుని మంత్రి రోజా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 

నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత అని సీఎం జగన్ అనేంతటివాడివా నువ్వు… ముందు నీ బతుకేంటో చూసుకో అని ఘాటుగా బదులిచ్చారు. జగన్ కంటే ముందు రాజకీయాల్లోకి వచ్చిన పవన్ ఇప్పటిదాకా వార్డు మెంబర్ గా కూడా గెలవలేకపోయాడని రోజా ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల జెండాలు మోసే కూలీ పవన్ కల్యాణ్ అని, తన స్థాయికి మించి మాట్లాడడం తగదని హితవు పలికారు. 

జగన్ 13 ఏళ్ల కిందట రాజకీయాల్లోకి వచ్చి రెండు పర్యాయాలు ఎంపీగా గెలిచారని, మరో రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారని రోజా వెల్లడించారు. జగన్ ఒకసారి విపక్ష నేతగా ఉన్నారని, ఆ తర్వాత 151 మంది ఎమ్మెల్యేల బలంతో సీఎం పీఠం అధిష్ఠించారని వివరించారు.

 నారా బ్రాహ్మణి వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన మంత్రి రోజా

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అర్ధాంగి నారా బ్రాహ్మణి నిన్న రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బ్రాహ్మణి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి రోజా ఘాటుగా స్పందించారు. మీ మామ చంద్రబాబు ఎంత వెన్నుపోటుదారుడో తెలియదా? అని ప్రశ్నించారు. కావాలంటే, ఎన్టీఆర్ చివరి రోజుల్లో విడుదల చేసిన వీడియోను బ్రాహ్మణి ఓసారి చూడాలని హితవు పలికారు. 

దేవాన్ష్ కు పొరపాటున కూడా సీఐడీ రిమాండ్ రిపోర్ట్ చూపించవద్దని, ఒకవేళ ఆ రిపోర్ట్ చూపిస్తే మా తాత ఇంత అవినీతిపరుడా అని దేవాన్ష్ అనుకుంటాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఏ సాక్ష్యాధారాలతో అరెస్ట్ చేశారంటున్న బ్రాహ్మణి… ఓసారి సీఐడీ ఆఫీసుకెళ్లి అడిగితే సాక్ష్యాధారాలు చూపిస్తారని రోజా అన్నారు. 

బ్రాహ్మణి మాటలు చూస్తే, ఆమెకు చదువు చెప్పిన వాళ్లు తల గోడకేసి కొట్టుకుంటారని వ్యంగ్యం ప్రదర్శించారు. బ్రాహ్మణిని ఓ బ్రహ్మాస్త్రం అనుకుంటున్నారని, కానీ ఆమె తుస్సుమందని ఎద్దేవా చేశారు.

Related posts

గుంటూరు వైసీపీలో విభేదాలు.. ఎమ్మెల్యే, మేయర్ మధ్య వాగ్వాదం

Ram Narayana

నేను విజయవాడ పశ్చిమం నుంచి పోటీ చేయడంలేదు: కేశినేని నాని

Ram Narayana

వైసీపీ నేత బాలినేని అధికారుల తీరుపై రురుసలు .. సీఎం జగన్ కలిసేందుకు తాడేపల్లికి !

Ram Narayana

Leave a Comment