ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

చంద్రబాబు అరెస్ట్ లో వైసీపీతో పాటు బీజేపీ హస్తం కూడా ఉంది: హర్షకుమార్

  • నారా భువనేశ్వరిని పరామర్శించిన హర్షకుమార్
  • చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని వ్యాఖ్య
  • ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరన్న మాజీ ఎంపీ

టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని మాజీ ఎంపీ హర్షకుమార్ పరామర్శించారు. ఆమెకు సంఘీభావాన్ని ప్రకటించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తున్నానని చెప్పారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని… రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్ట్ చేశారని విమర్శించారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ లో వైసీపీతో పాటు బీజేపీ హస్తం కూడా ఉందని ఆరోపించారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా చంద్రబాబును ఏమీ చేయలేరని అన్నారు. వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని చెప్పారు.

Related posts

ఎయిర్ అంబులెన్సులో హుటాహుటిన కొడాలి నాని ముంబైకి తరలింపు…

Ram Narayana

కడప నూతన మేయర్‌గా పాక సురేశ్ ఏకగ్రీవ ఎన్నిక..

Ram Narayana

ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లంటే..!

Ram Narayana