ప్రమాదాలు ...

దారుణం.. బాణసంచా పేలి 11 మంది దుర్మరణం

  • కర్ణాటకలోని అత్తిబెలెలోగల గోడౌన్‌లో ఘటన
  • శివకాశి నుంచి వచ్చిన బాణసంచా లోడు దించుతుండగా చెలరేగిన మంటలు
  • క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా 11 మంది మృతి

కర్ణాటకలో బాణసంచా పేలి ఏకంగా 11 మంది దుర్మరణం చెందారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలో తమిళనాడు సరిహద్దుకు సమీపంలో ఉన్న ఆనేకల్ తాలూకా అత్తిబెలెలో శనివారం ఈ దారుణం జరిగింది. అక్కడి నవీన్ గోడౌన్‌కు తమిళనాడు శివకాశి నుంచి బాణసంచా లోడు వచ్చింది. లోడు వాహనాల నుంచి దించుతుండగా అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నాలుగు దుకాణాలు, ఒక మినీ కంటైనర్, రెండు పికప్ వాహనాలు కాలిపోయాయి. క్షణాల్లో వ్యాపించిన మంటల్లో చిక్కుకుని షాపు యజమానితో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు.

Related posts

ముంబై తీరంలో ఘోర పడవ ప్రమాదం… 66 మందిని రక్షించిన రెస్క్యూ టీం…

Ram Narayana

కర్నూలు బస్సు ప్రమాదంలో తీవ్ర విషాదం… మొత్తం కుటుంబం సజీవదహనం!

Ram Narayana

వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా కరెంట్‌ షాక్‌.. ఇద్దరు యువకుల మృతి!

Ram Narayana