Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

ఏపీలో ఈ సారి ఎన్నికలు అంత ఈజీగా ఉండవు: బాలినేని

  • గెలుపు కోసం అందరూ కష్టపడాల్సిందేనన్న బాలినేని
  • తాము కూడా గట్టిగా పోరాడుతామని వ్యాఖ్య
  • మాగుంట పుట్టినరోజు సందర్భంగా బాలినేని సంచలన వ్యాఖ్యలు

ఏపీలో ఈసారి ఎన్నికలు అంత ఈజీగా ఉండవని వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కూడా గట్టిగానే పోరాడుతామని చెప్పారు. గెలుపు కోసం అందరూ కష్టపడాల్సిందేనని అన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో బాలినేని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

రాజకీయాల కోసం మాగుంట కుటుంబం వారి సొంత డబ్బును ఖర్చు చేస్తోందని చెప్పారు. ఎన్ని సమస్యలు వచ్చినా మౌనంగా ఉంటూ ముందుకు సాగుతున్నారని బాలినేని అన్నారు. ఈ ఎన్నికల్లో మాగుంట ఉంటారో, ఆయన కుమారుడు ఉంటారో వారే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ సందర్భంగా మాగుంట మాట్లాడుతూ, ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులను తమ కుటుంబం ఇప్పుడు ఎదుర్కొంటోందని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో తమ కుటుంబానికి అండగా నిలిచిన నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Related posts

బి.జె.పి… కొత్త అర్థం చెప్పిన షర్మిల!

Ram Narayana

సైకో పాలన పోవాలనే టీడీపీ, జనసేన పొత్తు … యువగళం ముగింపు సభలో చంద్రబాబు…

Ram Narayana

చంద్రబాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే: సీఎం జగన్

Ram Narayana

Leave a Comment