అంతర్జాతీయం

వైమానిక దాడిలో భద్రతా చీఫ్ అలీ లరిజానీ మృతి.. అధికారికంగా ప్రకటించిన ఇరాన్…

ఇరాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ చీఫ్ అలీ లరిజానీ ఒక వైమానిక దాడిలో మరణించారు. ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ జరిపిన దాడిలోనే ఆయన మరణించారని అంతకుముందు వార్తలు రాగా, తాజాగా ఇరాన్ ప్రకటనతో వాటికి బలం చేకూరింది.

ఈ దాడిలో లరిజానీతో పాటు ఆయన కుమారుడు, అంగరక్షకులు కూడా ప్రాణాలు కోల్పోయారని సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక ప్రకటనలో తెలిపింది. “ఇరాన్, ఇస్లామిక్ విప్లవ పురోగతి కోసం జీవితాంతం పోరాడిన ఆయన, చివరకు తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకున్నారు. దైవ పిలుపునకు సమాధానమిచ్చి సేవలోనే అమరత్వాన్ని పొందారు” అని కౌన్సిల్ ఆయన మరణంపై విడుదల చేసిన ప్రకటనలో కొనియాడింది. లరిజానీ మరణంతో పశ్చిమాసియాలో ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని అంతర్జాతీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts

అమెరికా సైబర్ చీఫ్ ‘చాట్ జీపీటీ’ నిర్వాకం.. సెన్సిటివ్ ఫైల్స్ అప్‌లోడ్ చేసి అడ్డంగా దొరికిన వైనం

Ram Narayana

యూట్యూబర్ కు నాలుగు నిమిషాల్లో ఓకే చెప్పిన సత్య నాదెళ్ల!

Ram Narayana

రణరంగంలా తైవాన్ పార్లమెంట్.. చితక్కొట్టేసుకున్న ఎంపీలు.. !

Ram Narayana