కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంత మోసం,దగా … మంత్రి పువ్వాడ అజయ్ ధ్వజం
కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలుకు నోచుకునేవి కావని ఎద్దేవా ..!
60 సంవత్సరాలుగా అమలు చేయని వాగ్దానాలు ఇప్పుడు చేస్తారా …
కాంగ్రెస్ మోసపు మాటలు నమ్మొద్దు …గోసపడతారు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ కు అత్యధిక సీట్లు ఖాయం…మంత్రి పువ్వాడ
కాంగ్రెస్ మ్యానిఫెస్టోమేము కాపీ కొట్టడం కాదు ..బీఆర్ యస్ పథకాలు కాంగ్రెస్ కాపీ కొడుతోంది ..
కాంగ్రెస్ మ్యానిఫెస్టో అంత పచ్చి మోసం,దగా అమలుకు నోచుకోని ఆచరణ సాధ్యంకాని మాటలు చెప్పి ప్రజలను మోసం చేయాలనీ కాంగ్రెస్ చూస్తుంది తస్మాత్ జాగ్రత్త …వారి మోసపు మాటలు నమ్మి గోసపడద్దు అని మంత్రి పువ్వాడ హెచ్చరించారు . మంగళవారం ఉదయం ఖమ్మం జిల్లా బీఆర్ యస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి కాంగ్రెస్ విధానాలపై విమర్శలు గుప్పించారు . 60 సంవత్సరాలుగా అమలు చేయని వాగ్దానాలు ఇప్పుడు చేస్తామని కొంతమంది వస్తున్నారని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు .
రేవంత్ రెడ్డి ఆరు గ్యారంటీ ల్లో రైతుబంధు లా ఓ పథకం పెడతా అనడం మా పథకం కాపీ కొట్టడం కాదా…? పువ్వాడ ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ బీఆర్ యస్ పథకాల కాపీలే..! కెసిఆర్ ఆదర్శమైన పాలన చూసే కాంగ్రెస్ పార్టీ నాయకులు వారింటి గ్యారెంటీ అంటూ డ్రామాలు చేస్తున్నారని దుయ్యబట్టారు .దేశం గర్వించదగ్గ పాలన అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ స్కిమ్ లు అన్ని బిజెపి, కాంగ్రెస్ పార్టీలు కాపీ చేస్తున్నాయి.. బిఆర్ఎస్ మేనిఫెస్టోతో కాంగ్రెస్ హామీలు తెల్లబోయాయని అన్నారు . 60 సంవత్సరాలు పాలన చేసిన కాంగ్రెస్ ఎప్పుడైనా బీమా స్కిమ్ లు పెట్టారా..? రైతులు విద్యార్థులు నిరుద్యోగులు అత్యధికంగా చనిపోయింది కాంగ్రెస్ పాలకుల హయాంలోనే అనే విషయాన్నీ ప్రజలు మర్చి పోలేదని అన్నారు .
2009 కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామి ఒక్కటి కూడా చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఏదైనా చేస్తాం అని బురడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలోనే అమలు చేయని పథకాలను ఇప్పుడు ఎలా చేస్తదన్నారు . కాంగ్రెస్ పై ప్రజల్లో విశ్వాసం లేదు అందువల్లనే మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తుందని విమర్శలు గుప్పించారు .
తెలంగాణలో గడిచిన 9 ఏళ్లలో ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ పాలకులు అధికారంలో ఉన్నప్పుడు విధ్వంసాలు, అరాచకాలు సృష్టించి రాష్ట్రంలో ప్రశాంతత లేకుండా చేశారు. నాడు కాంగ్రెస్ హయాంలో కర్ఫ్యూల వలయం ఉండేది, నేడు అవి లేవు అని కాంగ్రెస్ పార్టీ నాయకులను తీవ్రంగా విమర్శించారు.
ఈసారి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ యస్ కు అత్యధిక సీట్లు రావడం ఖాయమని అందుకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే కారణం అవుతాయని అన్నారు . పార్టీ అభ్యర్థుల పేర్లను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నాటినుండి ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. రాష్ట్రాన్ని అనేక రంగాల్లో అభివృద్ధి చేసిన కేసీఆర్ ను మూడవసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ప్రజలు పట్టుదలతోఉన్నారని అన్నారు . తిరిగి ఎన్నికల్లో గతంలో కొనసాగిస్తున్న పథకాలను మరింత ప్రోత్సాహకంగా అమలు చేయనున్నట్లు హామీ ఇవ్వడం జరిగిందని అన్నారు .
బిఆర్ఎస్ పార్టీకి పోటీ ఇస్తామని ప్రగల్బాలు పలుకుతున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థుల ఎవరో తేల్చుకోలేని పరిస్థితిలో ఉందని ఎద్దేవా చేశారు. ప్రజా సంక్షేమ పాలన అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట జిల్లా ప్రజలు నిలవాలని భావిస్తున్నారని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కువ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధిస్తుంది, వచ్చేది మళ్ళీ తమ ప్రభుత్వమే అని విశ్వాసం వ్యక్తం చేశారు జిల్లా ప్రజలు విభిన్నంగా ఆలోచన చేయాలి అని కోరారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అభివృద్ధి సంక్షేమం అందించి వేల కోట్లు నిధులు ఇచ్చిన కేసీఆర్ ను ఆశీర్వదించాలి.. జిల్లాలో కొనసాగిన అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకొని వెళ్లేందుకు కేసిఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని కోరారు. 60 ఏళ్ల పైబడి పాలన చేసిన కాంగ్రెస్ పాలకులు చేయలేని పనులను ముఖ్యమంత్రి కెసిఆర్ చేసి చూపించారు అని తెలిపారు.
ఈ సమావేశంలో ఎంపీలు నామ నాగేశ్వరావు , వద్దిరాజు రవిచంద్ర , ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య , రాములు నాయక్ , రాష్ట్ర విత్తన అభివృద్ధి శాఖ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు , ఖమ్మం నగర మేయర్ నీరజ , నగర బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పగడాల నాగరాజు , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ ,ఆర్జేసీ కృష్ణ , ఉప్పల వెంకటరమణ మరియు తదితరులు పాల్గొన్నారు.