Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్

నన్ను సాదుకుంటారా.. సంపుకుంటారా మీఇష్టం .. మంత్రి పువ్వాడ అజయ్
కెవి బంజరలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన పువ్వాడ..
రఘునాథపాలెం మండల అభివృద్ధిని సాదుకుంటారా.. సంపుకుంటారా
నన్ను సాదుకుంటారో ..చంపుకుంటారో మీ ఇష్టం …పువ్వాడ అజయ్ ఉద్యేగభరిత ప్రసంగం
నాకు వచ్చిన అవకాశం తో కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా…
పాలేరు లో చల్లని రూపాయ ఇక్కడ చెల్లుతుందా అంటూ తుమ్మల పై విమర్శలు
నేను పక్క లోకల్ ఇక్కడే పుట్టాను ..ఖమ్మం అభివృద్ధి పై చర్చ జరగాలి

ఖమ్మం బీఆర్ యస్ అభ్యర్థి మంత్రి పువ్వాడ అజయ్ నామినేషన్ వేసిన అనంతరం రఘునాటపాలెం మండలం లో పర్యటించారు … తనను సాదుకుంటారో …సంపుకుంటారో మీఇష్టం అని ఉద్యేగభరిత ప్రసంగం చేశారు ..తనకు వచ్చిన అవకాశంతో ఖమ్మం అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేశాను … సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గానికి 3 వేల 500 కోట్ల నిధులు తెచ్చాను ..గతంలో ఎన్నడూ ఇన్ని నిధులు తెచ్చిన దాఖలాలు లేవని అన్నారు .

ఖమ్మం బీఆర్ యస్ అభ్యర్థి ,మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం నామినేషన్ వేసిన అనంతరం తొలి ప్రచారం ను రఘునాధపాలెం మండలం కెవి బంజర గ్రామంలో రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మీ ఆశీర్వాదంతో రెండు సార్లు ఎమ్మేల్యే గా గెలిచిన.. రెండు సార్లు ఎన్నికల ప్రచారం ఇక్కడి నుండే మొదలు పెట్టిన అని, ఇక్కడి నుండి ప్రచారం మొదలు పెడితే గెలుపు తత్యం అని ఇది ఆనవాయితీగా మారిపోయిందన్నారు. గెలిచిన రెండు సార్లు మీకోసమే పని చేసిన. కూలీ లాగా పని చేసి పెట్టిన. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మండలాన్ని అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నిలిపినం అన్నారు. ప్రతి గ్రామంలో మట్టి రోడ్లు లేకుండా అన్ని సీసీ రోడ్లుగా మర్చినమని గుర్తు చేశారు.

ఈ మండలం గత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నపుడు మండలం ఎర్పాటు అయిందని కాంగ్రెస్ అభ్యర్థి చెప్పటం అవగాహన రాహిత్యం స్పష్టం గా తెలుస్తోంది అన్నారు.
అప్పుడు అర్బన్ మండలంగా ఉండేదని, రఘునాధపాలెం మండలం గా నామకరణం చేసిందిబీఆర్ యస్ ప్రభుత్వం వచ్చిన తొలిసారి అధికారం లోకి వచ్చినంక అని అన్నారు.
అప్పటి వరకు నువ్వు ఎం చేశావు.. మోచేతికి బెల్లం పెట్టీ ప్రజలతో నాకించినవ్ అని విమర్శించారు. నువ్ చేసింది ఎంటో ఒక్కటి చెప్పాలని డిమాండ్ చేశారు.
రఘునాధపాలెం కు బొడ్డు కోసి పేరు పెట్టినట్టు చెప్తున్నాడు.. బొడ్డు కాదు మండలం గొంతు కొశావు అని ద్వజమెత్తారు. ఒక్క పని అన్నా చేశావా .. పైగా అంతా నేనే చేశానని కోతలు కొస్తున్నవ్.. ఇదెక్కడి న్యాయం .. ప్రజలు గమనించాలన్నారు…సత్తుపల్లిలో చెల్లని రూపాయి ఖమ్మం వచ్చింది.. ఖమ్మంలో చెల్లలేదని పాలేరు పోయింది.. పాలేరులో కూడా చెల్లకపోతే మళ్ళీ ఖమ్మం వచ్చింది.. ఈ సారి శాస్వతంగా ఖమ్మం జిల్లా నుండి తరిమికొడతామన్నరు.
24గంటలు మీకు అందుబాటులో ఉన్నాం.. మీరు అడిగిన పనులన్నీ చేసిపెట్టిన.. ఇపుడు నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది…ప్రతి గ్రామంలో రైతు బందు, రైతు భీమా, పోడు భూములకు పట్టాలు ఇప్పించిన ఘనత మన బీఆర్ యస్ ప్రభుత్వం కే దక్కుతుందన్నారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి మీ గ్రామాలను మీరే పరిపాలించే విధంగా అవకాశం కల్పించడం జరిగిందన్నారు…వచ్చే ఎన్నికల్లో మనబీఆర్ యస్ ప్రభుత్వం కు ఓటు వేసి ఈ అభివృద్ధిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.,,అంతకు ముందు పువ్వాడ అజయ్ నగరకార్పొరేషన్ కార్యాలయంలో నామినేషన్ వేశారు .నామినేషన్ కార్యక్రమంలో ఎంపీ నామ నాగేశ్వరరావు ,డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం ,జహీర్ అలీ తదితరులు పాల్గొన్నారు .

Related posts

అసెంబ్లీ ఎన్నిలలో వీడియో గ్రఫీ చేసినవీడియో గ్రాఫ్రార్స్ బకాయిలు తక్షణమే చెల్లించాలి..

Ram Narayana

పార్లమెంటు ఎన్నికల్లో మన సత్తా చూపిద్దాం..ఎంపీ నామ నాగేశ్వరరావు

Ram Narayana

ఆటోవాలా అవతారమెత్తిన నామ …

Ram Narayana

Leave a Comment