Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

నాంపల్లిలో ఘోర అగ్ని ప్రమాదం.. ఏడుగురి సజీవ దహనం.. వీడియో ఇదిగో!

  • బజార్ ఘాట్ లోని ఓ గోడౌన్ లో ఎగసిపడ్డ మంటలు
  • ఐదు అంతస్తులకు వ్యాపించడంతో లోపల చిక్కుకున్న కార్మికులు
  • నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న సిబ్బంది

హైదరాబాద్ లో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఉన్న ఓ గోడౌన్ లో సోమవారం మంటలు ఎగసిపడ్డాయి. ఐదు అంతస్తుల వరకు మంటలు వ్యాపించాయి. దీంతో లోపల ఉన్న వర్కర్లు మంటల్లో చిక్కుకున్నారు. ఏడుగురు వర్కర్లు సజీవదహనమయ్యారని సమాచారం. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నాలుగు ఫైరింజన్లు ప్రమాద స్థలానికి చేరుకున్నాయి. వాటితో మంటలను అదుపులోకి తెచ్చేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు.

గోడౌన్ ఉన్న భవనం గ్రౌండ్ ఫ్లోర్ లో మెకానిక్ షెడ్ ఉందని, టపాసులు పేల్చడంతో షెడ్ లోని డీజిల్ డబ్బాలకు నిప్పంటుకుందని స్థానికులు చెప్పారు. గోడౌన్ లో కెమికల్స్ ఉండడంతో మంటలు వేగంగా పై అంతస్తులకు పాకాయని డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు. మంటల్లో చిక్కుకున్న పదిహేను మందిని కాపాడినట్లు తెలిపారు. ఉదయం 9:30 గంటల ప్రాంతంలో గ్రౌండ్ ఫ్లోర్ లో నిప్పంటుకుందని

Related posts

రాజ్ భవన్‌కు, ప్రగతి భవన్‌కు ఎలాంటి గ్యాప్ లేదు …గవర్నర్ తమిళశై…!

Ram Narayana

రాష్ట్రానికి అన్యాయం జరిగింది.. ఢిల్లీలో టీ కాంగ్రెస్ ఎంపీల ధర్నా!

Ram Narayana

శ్రీనివాస్ రెడ్డికి సుమన్ టీవీ చైర్మన్ శుభాకాంక్షలు

Ram Narayana

Leave a Comment