ఆంధ్రప్రదేశ్

ఏపీ రాజధాని అమరావతే: రాజ్యసభలో వెల్లడించిన కేంద్రం

  • రాజ్యసభలో లిఖితపూర్వక ప్రకటన చేసిన కేంద్ర సహాయమంత్రి కౌశల్ కుమార్
  • 28 రాష్ట్రాల రాజధానులకు మాస్టర్ ప్లాన్ ఉందని వెల్లడి
  • కేంద్రం ఆమోదించిన మాస్టర్ ప్లాన్ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టీకరణ

ఏపీ రాజధాని అమరావతి అంటూ కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కౌశల్ కుమార్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక ప్రకటన చేశారు. 28 రాష్ట్రాల రాజధానుల అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ ఉందని, ఆ ప్లాన్ కు కేంద్రం ఆమోదం తెలిపిందని కౌశల్ కుమార్ తెలిపారు. ఈ జాబితాలో అమరావతి కూడా ఉందని స్పష్టం చేశారు. అమరావతికి కూడా మాస్టర్ ప్లాన్ ఉందని మంత్రి వెల్లడించారు. అమరావతి మాస్టర్ ప్లాన్ కు కూడా కేంద్రం ఆమోదం ఉందని వివరించారు.

Related posts

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సంక్షేమానికి చిరునామా:మంత్రి హరీశ్‌ రావు!

Drukpadam

శీలానీవే శిల్పీ నీవే శిల్పం నీవే శృష్ఠిలో …

Drukpadam

ఇంటి భోజనంతో మహిళలకు ఉపాధి.. అమరావతిలో సీఆర్డీఏ కొత్త పథకం!

Ram Narayana