Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

కేసీఆర్ పాలన అంతా తప్పుల తడక అవినీతి అక్రమాల పుట్ట…పొంగులేటి ధ్వజం

కేసీఆర్ పాలన అంతా తప్పుల తడక అక్రమాల పుట్ట ..ధరణి పేరుతో దగుల్బాజీ వ్యవహారం ..డబ్బు అహంకారంతో వీర్రవీగారు అని రాష్ట్ర రెవిన్యూ , గృహనిర్మాణం , సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వ అవినీతి అరాచకాలపై తీవ్రస్వరంతో ధ్వజమెత్తారు …పాలేరు నియోజకవర్గంలోని కుసుమంచిలో గల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమక్షంలో ప్రవేశించిన సందర్భంగా జరిగిన సభలో ప్రసంగించారు … డబ్బుతో మమ్ములను ఓడించాలని ఎన్ని కుయుక్తులు పన్నినప్పటికీ ప్రజలు దీవెనలతో గెలిచామని అన్నారు …ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారంటీలకు కట్టుబడి ఉంటుందని అన్నారు …ఖజానా ఖాళీచేయడమేకాకుంగా 6 లక్షల 71 వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి నిస్సిగ్గుగా మాట్లాడుతున్న బీఆర్ యస్ చర్యలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు ..కాళేశ్వరంలో అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చేసిన ప్రయత్నాలను తిప్పికొట్టిన తెలంగాణ ప్రజలకు శాల్యూట్ చేయాలసిందేనని పొంగులేటి అన్నారు …

ప్రజలు వివేకం తో పది సంవత్సరాలు పాలించి ప్రజల గోడు పట్టని ప్రభుత్వాన్ని దించి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని ,వారి అభీష్టానికి అనుగుణగంగ ప్రజాప్రభుత్వం ఏర్పడిందని అన్నారు …సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంత్రులం ఎమ్మెల్యేలు ప్రజల కష్టాలు తీర్చడానికి సేవకులుగా పనిచేస్తామని అన్నారు ..

గత ప్రభుత్వం 6లక్షల 71 వేల కోట్ల అప్పులు చేసిందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అసెంబ్లీలో శ్వేత పత్రం విడుదల చేస్తే అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు ప్రవర్తించిన తీరు జుగుస్సాకరంగా ఉందని అన్నారు .ఈ ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. ప్రజల కష్టాల్లో పాలు పంచుకునే ప్రభుత్వం తప్ప మాయమాటలు చెప్పి ప్రభుత్వం కాదన్నారు ..

ఇరిగేషన్ ప్రాజెక్టు ల పేరుతో లక్ష కోట్ల అవినీతి జరిగిందని దానిపై సమగ్ర విచారణ జరుగుతుందని అన్నారు ..గత ప్రభుత్వం లో చేసిన తప్పులు కనపడతాయాని ఫైళ్లను మాయం చేసే కార్యక్రమం చేపడితే ఆ ఫైళ్లను ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు …
మీరు తప్పు చేయకపోతే ఫైళ్లను మాయం చేయాలని ఎందుకు చెప్పని పొంగులేటి డిమాండ్ చేశారు .. ప్రభుత్వ ఆస్తులను వారి తొత్తులకు కట్టబెట్టారు.. ఖమ్మం లో రెండు మూడు అంశాలను కలెక్టర్ బయటకు తీశారు..ప్రభుత్వ ఆస్తులను ప్రజలకు చెందే విధంగా చేయడానికి ఇందిరమ్మ ప్రభుత్వం ఉందన్నారు …

కాంగ్రెస్ కుటుంబ సభ్యులు అందరూ మనోధైర్యం తో గౌరవం గా ఉండి మీ కృషి తో తెచ్చుకున్న ఇందిరమ్మ రాజ్యంలో మీరందరూ భాగస్వామ్యులయి అందరం ప్రజల కోసం పని చేయాలని పొంగులేటి విజ్ఞప్తి చేశారు …

కార్యక్రమంలో పాల్గొన్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతు బంధు ఖాతాల్లో జమ అవుతుందని , ఆరు గ్యారంటీలను అములు చేసేందుకే ప్రజాపాలన ద్వారా దరఖాస్తులు తీసుకోవడం జరిగిందని అన్నారు …తమకు ఖమ్మం ,పాలేరు ప్రజలు సమానమేనని ,జిల్లాలో ఉన్న ముగ్గురం మంత్రులం జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు గురించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని అన్నారు …సీతారామ ప్రాజెక్ట్ ద్వారా పాలేరు ప్రజలకు సాగు,తాగు నీరు అందివ్వడం ,జిల్లాలో 10 నీళ్ల అందించే బృహత్తర కార్యక్రమాన్ని పూర్తీ చేసి మీచేత శహభాష్ అనిపించుకుంటామని తుమ్మల అన్నారు …

Related posts

మధిర బీఆర్ యస్ అభ్యర్థి లింగాల కమల్ రాజ్ కు డబ్బులు లేక ఇక్కట్లు

Ram Narayana

ఓటే వజ్రాయుధం …ఆలోచించి ఓటు వేయాలి …ఖమ్మం ,కొత్తగూడెం సభలో కేసీఆర్

Ram Narayana

బీఆర్ఎస్ పాలనలో అవినీతి, విశ్వాసఘాతుకం తప్ప ఏముంది?.. బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జ్ ప్రకాశ్ జవదేకర్

Ram Narayana

Leave a Comment