Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఆలయ ప్రారంభోత్సవంలా లేదు… మోదీ రాజకీయ వేడుకలా ఉంది: రాహుల్ గాంధీ

  • అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం
  • మోదీ, ఆర్ఎస్ఎస్ కేంద్రబిందువుగా ఈ కార్యక్రమం అంటూ రాహుల్ విమర్శలు
  • ఇలాంటి కార్యక్రమాలకు తాము వెళ్లలేమని స్పష్టీకరణ 

అయోధ్యలో ఈ నెల 22న రామ మందిరం ప్రారంభోత్సవం జరగనుండగా, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శనాస్త్రాలు సంధించారు. అది ఆలయ ప్రారంభోత్సవంలా లేదని, పూర్తిగా నరేంద్ర మోదీ రాజకీయ వేడుకలా ఉందని అన్నారు. 

“ఇది పక్కా ఆర్ఎస్ఎస్-బీజేపీ వేడుక. కాంగ్రెస్ అధ్యక్షుడు తాను ఈ కార్యక్రమానికి వెళ్లడంలేదని చెప్పడానికి ఇదే కారణం అనుకుంటా. మేం అన్ని మతాలకు, అన్ని ఆచారాలకు మద్దతిస్తాం. జనవరి 22న జరిగే వేడుక గురించి హిందూ మతాన్ని శాసించే వర్గాలు తాము ఏమనుకుంటున్నాయో ఇప్పటికే స్పష్టం చేశాయి. 

ఇది పక్కా రాజకీయ కార్యక్రమం అని తెలిసిపోయింది. కేవలం భారత ప్రధాని, ఆర్ఎస్ఎస్ లను కేంద్రబిందువుగా చేసుకుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఇలాంటి కార్యక్రమాలకు మేం వెళ్లగలిగే పరిస్థితులు లేవు. ఇలాంటి రాజకీయ వేడుకలకు కాంగ్రెస్ పార్టీ దూరం అని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని మోదీ, ఆర్ఎస్ఎస్ ఎన్నికల కార్యక్రమంలా మార్చివేశాయని విమర్శించారు.

Related posts

బీజేపీ ఓట్ల శాతంలో పెద్దగా మార్పు లేదు …

Ram Narayana

ముఖ్యమంత్రి పదవిపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఆసక్తికర వ్యాఖ్యలు

Ram Narayana

కేంద్రంలో మూడోసారీ మోదీనే.. యూకే పత్రికలో కథనం

Ram Narayana

Leave a Comment