ఖమ్మంలో ఘనంగా ఎన్టీఆర్ వర్దంతి …వివిడిగా..కలివిడిగా కాంగ్రెస్ టీడీపీలు..
టీడీపీ కార్యాలయంలో కార్యక్రంలో పాల్గొన్న రేణుకాచౌదరి
బై పాస్ రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ విగ్రహానికి నివాళులు
పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం …


జిల్లా కేంద్రమైన ఖమ్మంలో ఎన్టీఆర్ వర్దంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ టీడీపీ లు కలిసి .విడివిడిగా నివాళులు అర్పించాయి…టీడీపీ కార్యాలయంలో కేతిని హరీష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మాజీ కేంద్రమంత్రి కాంగ్రెస్ నాయకురాలు రేణుకాచౌదరి టీడీపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు ..ఈ కార్యక్రమంలో తుమ్మల అనుయాయులు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సాదు రమేష్ రెడ్డి , మాజీమార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్ తదితర కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు …అదే విధంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఆధ్వరంలో బై పాస్ రోడ్ లోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పీసీసీ ఉపాధ్యక్షులు ,మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు , పీసీసీ మెంబర్ రాయల నాగేశ్వరరావు , నగర కాంగ్రెస్ అధ్యక్షులు మహమ్మద్ జావేద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ..
జిల్లా టీడీపీ కార్యాలంయంలో ….





ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి కొబ్బరికాయలు కొట్టి నివాళులర్పించినారు తదనంతరం జిల్లా తెలుగుదేశం ఆఫీసు నుండి వందలాది మందితో ర్యాలీగా వెళ్లి ఎన్టీఆర్ సర్కిల్ నందు గజమాలతో మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీమతి రేణుకా చౌదరి గారితో కలిసి గజమాలవేసి నివాళులర్పించడం జరిగింది. తదనంతరము సభలో రేణుక చౌదరి మాట్లాడుతూ సమాజమే దేవాలయం,ప్రజలే దేవుళ్ళు అని నమ్మిన స్వర్గీయ ఎన్టీఆర్ ఆదర్శ ప్రాయుడని అన్నారు. నాకు రాజకీయ ఓనమాలు నేర్పింది కూడా నందమూరి తారక ఎన్టీ రామారావు అని అన్నారు అదేవిధంగా బడుగు,బలహీన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచి…అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అని తెలిపారు. ఈరోజు తెలుగువారు గౌరవంగా బ్రతుకుతున్నారంటే అది ఎన్టీ రామారావు పుణ్యమే అని ఆమె ఈ సందర్భంగా కొనియాడారు అనంతరం వేలాదిమందికి ఎన్టీఆర్ మార్గ్ వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి భాస్కరరావు కన్నీటి పృథ్వి బైరు అప్పారావు కూచిపూడి జై, నాగళ్ళ లక్ష్మణ్, బాబు మందపల్లి రజిని చింత నిప్పు నాగేశ్వరరావు పావని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
కాంగ్రెస్ ఆధ్వరంలో …


నందమూరి తారక రామారావు 28 వ వర్ధంతి సందర్భంగా ఖమ్మం జిల్లాలోని ఎన్టీఆర్ సర్కిల్లో గల ఎన్టీఆర్ కాంస్య విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు …కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ టీపీసీసీ ఉపాధ్యక్షులు పోట్ల నాగేశ్వరరావు ,ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ ఖమ్మం నగర కాంగ్రెస్ అధ్యక్షులు మొహమ్మద్ జావిద్ ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్టీఆర్ అభిమానులు పాల్గొనడం జరిగింది….
