ఖమ్మం వార్తలు

ఖమ్మంలో బీజేపీ దూకుడు …

మే 13 న నాల్గొవదశ ఎన్నికల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ కు ఎన్నికలు జరగనున్నాయి…ఇందుకోసం అన్ని పార్టీలు సిద్ధం అవుతున్నాయి… బీఆర్ యస్ , బీజేపీ లు తమ అభ్యర్థులను ప్రకటించాయి … బీజేపీ మిగతా పార్టీలకంటే ముందుగా రంగంలోకి దిగింది …ఒకరకంగా చెప్పాలంటే ఖమ్మంలో దూకుడు ప్రదర్శిస్తుంది ….దేశంలో బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నాయని , మోడీ పాలనకు దేశ ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని నమ్మకంతో ఉంది … దీనికి తోడు అయోధ్యలో రామాలయ నిర్మాణం తమకు కలిసి వస్తుందని అంచనాతో ఉన్నారు …ప్రచారంలో దిట్టలైనా బీజేపీ ఇటీవల అయోధ్యలో జరిపిన రామాలయ నిర్మాణ ప్రచారాన్ని ప్రతి పల్లెకు తీసుకోని పోయి సెక్సెస్ అయిందనే చెప్పాలి …అయితే ఆ ప్రచారానికి ఓట్లు రాలతాయా లేదా అనే విషయాన్నీ పక్కన పెడితే గతం కన్నా ఈసారి బీజేపీ ప్రభావాన్ని తోసిపుచ్చలేమని రాజకీయపరిశీలకులు అభిప్రాయపడుతున్నారు …

తమపార్టీకి ఉన్న అనుకూలతను సొమ్ము చేసుకోవడం ద్వారా ఈసారి బీజేపీ ఖమ్మంలో తమ సత్తా చాటాలని బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది …దీంతో పార్టీ నేతలు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు …అన్ని పార్టీలకంటే ముందుగా ప్రచారాన్ని ప్రారంభించారు …ఖమ్మం లోకసభకు అభ్యర్థిగా ప్రకటించిన తాండ్ర వినోదరావు మంగళవారం ఖమ్మం చేరుకున్నారు ….ఆయనకు సాదర స్వాగతం లభించింది …బుధవారం ఖమ్మంలోని ఒక హోటల్ లో మీడియా సమావేశం వేర్పాటు చేశారు …అందులో అయోధ్య నుంచి భద్రాచలానికి కారిడార్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు …ఖమ్మం జిల్లా అభివృద్ధికి తనకున్న ఆలోచనలు మీడియాతో పంచుకున్నారు …ఇంకా మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ప్రకటించారు … అయితే గతంలో ఎప్పుడు పేరు వినపడని వినోదరావు కొంతకాలంగా బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేస్తూ హల్చల్ చేస్తున్నారు …ములకలపల్లి మండలం తిమ్మంపేటకు చెందిన వినోదరావు ఎన్నికల్లో పోటీచేయాలని కసి ,పట్టుదలతో ఉన్నట్లు కనిపిస్తున్నారు …

బీజేపీ ఖమ్మం టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు ….

ఖమ్మం టికెట్ కోసం మాజీ సీఎం జలగం వెంగళరావు తనయుడు వెంకట్రావు ప్రయత్నం చేశారు …తనకే టికెట్ ఇస్తామని బీజేపీ పెద్దలు హామీ ఇచ్చారని తప్పకుండ తనకే టికెట్ వస్తుందని అనుకున్నారు …జిల్లాకు చెందిన బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు ,కర్ణాటక సహా ఇంచార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డికి ఖమ్మం లోకసభ టికెట్ ఇవ్వవచ్చుననే ప్రచారం కూడా జరిగింది …ఖమ్మంకు చెందిన కొండపల్లి శ్రీధర్ రెడ్డి ,బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ , శ్రీరక్ష హాస్పటల్ కు చెందిన డాక్టర్ జి .వెంకటేశ్వర్లు లాంటి వారు టికెట్ ఆశించారు …కానీ తాండ్ర వినోదరావు వైపు పార్టీ కేంద్ర నాయకత్వం మొగ్గు చూపింది …ఆయనకు ఆరెస్సెస్ తో సంబంధాలు ఉన్నాయని , వ్యాపారవేత్త కావడం అదనపు అర్హతగా కలిసి వచ్చిందని అంటున్నారు …బీజేపీకి ఉన్న అనుకూలతను తాండ్ర వినోదరావు తనకు అనుకూలంగా ఏవిధంగా మల్చుకుంటాడో అనేది ఆసక్తిగా మారింది … ఖమ్మం జిల్లాకు బీజేపీ రాజకీయాలు అంతగా వంటపట్టవు అనే నానుడి ఉంది …గతంలో అనేక మంది బీజేపీ తరుపున పోటీచేసినప్పటికీ ఒక్క రవీంద్రనాయక్ తప్ప ఎవరు డిపాజిట్ దక్కించుకోలేదు …

పార్టీ బలం పెంచుకునే దిశగా అడుగులు …

నిజం చెప్పాలంటే ఖమ్మం జిల్లాలో బీజేపీ పార్టీకి పెద్దగా బలం లేదు ….కేంద్రంలో సర్కార్ మోడీ పాలన , అయోధ్యరాముడు పేరుతో ప్రచారాన్ని తీవ్రతరం చేసింది …బీఆర్ యస్ ఓడిపోయి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో బీజేపీ బలపడాలంటే బీఆర్ యస్ ఫోకస్ పెట్టింది …బీఆర్ యస్ ఉన్న అసమ్మతి వాదులు , వ్యాపారాలు ఇతరవర్గాల వారిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా జిల్లాలో పార్టీని పటిష్టం చేయాలనీ చూస్తుంది … అందులో భాగంగానే ఖమ్మంలో మీడియా సమావేశం సందర్భంగా పాలేరు నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ యస్ వారిని పార్టీలో చేర్చుకున్నారు అయితే ప్రజల మౌలిక సమస్యలు తీర్చకుండా బీజేపీ ఇచ్చే నినాదాలకు ప్రజలు ఎంతవరకు ఆకర్షితులవుతారనేది చూడాలి ….!

Related posts

ఖమ్మం నుంచే తుమ్మల పోటీ …!

Ram Narayana

ఖమ్మంలో రౌడీ రాజ్ ..మంత్రి మనుషుల దౌర్జన్యాలు …మాజీమంత్రి ఫైర్…

Ram Narayana

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం… చెరువులోకి దిగి తండ్రీ, కొడుకు మృతి

Ram Narayana