జాతీయ రాజకీయ వార్తలు

ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి పెండింగ్ లోనే

ఖమ్మం నుంచి పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది …జిల్లాకు చెందిన మంత్రుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడమే ఇందుకు కారణమని సమాచారం ….రాత్రి పొద్దుపోయిన తరువాత దేశంలోని నాలుగు రాష్ట్రాలకు చెందిన 14 మంది అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించగా తెలంగాణలోని నిజామాబాద్ , భువనగిరి ,మెదక్ , ఆదిలాబాద్ లోకసభకు పోటీచేసే అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ ఖమ్మం , వరంగల్ , హైద్రాబాద్ లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది …ఖమ్మంలో ముగ్గురు మంత్రుల బంధువులు తమకే టికెట్ కలవాలని పట్టు పట్టడంతో ఎవరికీ ఇవ్వాలో తేల్చుకోలేక కాంగ్రెస్ అధిష్టానం తలలు పట్టుకుంటుంది ….మంత్రుల బందువులకు ఇవ్వడమా లేక వారు కాకుండా వేరే వారిని ఎంపిక చేయడమా అనే మీమాంసలో పార్టీ ఉన్నట్లు తెలుస్తుంది ….రాష్ట్ర మంత్రివర్గంలో కీలకంగా ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తన సతీమణి నందినిని బరిలో నిలపాలని గట్టి పట్టుదలతో ఉన్నారు …ఇక మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన తమ్ముడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించేందుకు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారు …సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరావు తన తనయుడు డాక్టర్ యుగంధర్ కు టికెట్ వస్తే బాగుంటుందనే అభిప్రాయంతో ఉన్నారు …దీంతో ఖమ్మం టికెట్ ప్రకటన మరికొన్ని రోజులు ఆగిన ఆశ్చర్య పోవాల్సిన పనిలేదని కొందరు అంటున్నారు …

బుధవారం కాంగ్రెస్ ప్రకటించిన జాబితాలో ..

నిజామాబాద్ …టి .జీవన్ రెడ్డి
ఆదిలాబాద్ …ఆత్రం సుగుణ కుమారి
మెదక్ …..నీలం మధు
భునగిరి ….చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు …

Related posts

బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషలు ఎత్తివేసే కుట్ర …సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణ..

Ram Narayana

బీజేపీతో తాను సన్నిహితంగా ఉన్నానంటూ తప్పుడు ప్రచారం:డీకే శివకుమార్

Ram Narayana

తెలంగాణాలో 150 కి పెరగనున్న అసెంబ్లీ సీట్లు …మహిళలకు 50 అసెంబ్లీ సీట్లు ఖాయం …

Ram Narayana