- ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానన్న కేజ్రీవాల్
- న్యాయం జరగాలని వ్యాఖ్య
- ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయన్న కేజ్రీవాల్
- నిష్పక్షపాత విచారణ జరిగినప్పుడే సరైన న్యాయం అందుతుందన్న ఢిల్లీ సీఎం
పార్టీ ఎంపీ స్వాతి మాలివాల్ మీద దాడి ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తొలిసారి స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని ఆశిస్తున్నానని… న్యాయం జరగాలని అన్నారు. ఈ కేసులో రెండు కోణాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇద్దరి వైపు నుంచి నిష్పక్షపాత విచారణ జరిగినప్పుడే సరైన న్యాయం అందుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని… కాబట్టి ఏమీ మాట్లాడలేనన్నారు.
కేజ్రీవాల్ ఇంట్లో స్వాతి మాలివాల్‌తో బిభవ్ కుమార్ అమర్యాదగా ప్రవర్తించి, దాడి చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో బిభవ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుడిని ముంబైకి తీసుకువెళ్లారు. నిందితుడి నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్, సీసీటీవీ రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.