క్రైమ్ వార్తలు

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువతి మృతి..!

  • మృతురాలిని గుంటిపల్లి సౌమ్యగా గుర్తింపు
  • యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన యువతి
  • స్వగ్రామం యాదగిరిగుట్ట సమీపంలోని యాదగిరిపల్లె

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణ ప్రాంతానికి చెందిన యువతి దుర్మరణం చెందారు. మృతురాలిని గుంటిపల్లి సౌమ్యగా గుర్తించారు. ఆమె స్వస్థలం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట సమీపంలో గల యాదగిరిపల్లె.  ఈ ఘటన ఫ్లోరిడా నగరంలో ఆదివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది.

యాదగిరిపల్లికి చెందిన సౌమ్య (25) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. అక్కడి అట్లాంటిక్ యూనివర్సిటీలో ఎమ్మెస్ చదువుతోంది. చదువుకుంటూనే ఆమె పార్ట్ టైమ్‌ ఉద్యోగం చేస్తోంది. ఆదివారం అర్ధరాత్రి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అతివేగంగా వచ్చిన కారు ఆమెను వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సౌమ్య అక్కడికక్కడే మృతి చెందింది.  విషయం తెలుసుకున్న సౌమ్య తల్లిదండ్రులు కోటేశ్వరరావు , బాలమణిలు కన్నీరు మున్నీరు అవుతున్నారు …మృతదేహాన్ని స్వదేశం తీసుకోని వచ్చేందుకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సహాయం కోసం అభ్యర్థించారు …

Related posts

మత్తు మందు ఇచ్చి.. జర్నలిజం విద్యార్థినిపై ప్రియుడు, అతడి స్నేహితుడి ఘాతుకం…

Ram Narayana

దేవగిరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం!

Drukpadam

ఫోన్ నంబర్ ‘బ్లాక్’ చేశాడని దారుణం.. ప్రియుడిని కత్తితో పొడిచి చంపిన యువతి!

Ram Narayana