- డెస్క్ టాప్ సిస్టంలలో క్రోమ్ యూజర్లకు హై రిస్క్
- సైబర్ దాడికి గురయ్యే ప్రమాదం ఉందని వెల్లడి
- ఆటోమేటిక్ అప్ డేట్ లను ఎనేబుల్ చేసుకోవాలని సూచన
డెస్క్ టాప్ సిస్టంలో గూగుల్ క్రోమ్ వాడుతున్న వారు వెంటనే క్రోమ్ బ్రౌజర్ ను అప్ డేట్ చేసుకోవాలని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సెర్ట్ ఇన్) సూచించింది. గూగుల్ క్రోమ్ యూజర్ల (డెస్క్ టాప్) కు హై రిస్క్ ఉందని హెచ్చరించింది. పాత బ్రౌజర్ వాడుతున్న కంప్యూటర్ లపై సైబర్ దాడి జరిగే అవకాశం ఉందని చెప్పింది. ఇప్పటికే ఎఫెక్ట్ అయిన సిస్టం ద్వారా రిమోట్ కంట్రోల్ తో దాడి చేయొచ్చని, సిస్టంలోని మీ సెన్సిబుల్ డాటాను యాక్సెస్ చేయవచ్చని పేర్కొంది. లేదా హానికరమైన సాఫ్ట్‌వేర్ ను మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చేయవచ్చు, సిస్టమ్‌ను పూర్తిగా షట్ డౌన్ కూడా చేయవచ్చని తెలిపింది. మీ సిస్టంను సేఫ్‌గా ఉంచుకోవడానికి సెర్ట్ ఇన్ పలు సూచనలు చేసింది.
సెర్ట్ ఇన్ సూచనలు ఇవే..
- క్రోమ్ బ్రౌజర్ ను లేటెస్ట్ వెర్షన్ కు అప్‌డేట్ చేయాలి.
- ముందుగా బ్రౌజర్ మెనూకు వెళ్లి ‘హెల్ప్’, తర్వాత ‘ఎబౌట్ గూగుల్ క్రోమ్’ సెలక్ట్ చేయాలి.
- దీంతో బ్రౌజర్ ఆటోమెటిక్‌గా అప్‌డేట్స్ చెక్ చేసి ఇన్‌స్టాల్ చేస్తుంది.
- ఫ్యూచర్లో సైబర్ దాడుల బారిన పడకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్ ఆటోమెటిక్ అప్‌డేట్‌లను ఎనేబుల్ చేయాలి.
- బ్రౌజర్ ఎల్లప్పుడూ లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్‌లను కలిగి ఉండాలి.