తెలంగాణ వార్తలు

ఇది ప్రజాపాలనంటే..ప్రపంచంతో పోటీపడలనే లక్ష్యంతో ముందుకు..డిప్యూటీ సీఎం భట్టి !

ప్రజలపాలనంటే మాటలతో చెప్పకుండా చేతల్లో చూపిస్తున్నాం …ఇది ఇందిరమ్మ రాజ్యం సంక్షేమం రాజ్యం వచ్చే ఆదాయాన్ని ప్రజలకు పంచడమే అందుకు అనుగుణంగా పాలనా సాగిస్తున్నాం …ఇది ప్రజాపాలనంటే అని నిరూపిస్తున్నాం…ప్రపంచంతో పోటీపడే లక్ష్యంతో ముందుకు పోతున్నామని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు ..మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా ఖమ్మం జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకలలో ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు గౌరవ వందనం స్వీకరించి జాతీయ పతాకం ఆవిష్కరించారు.

అనంతరం ప్రజలనుద్దేశించి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సందేశంలో సాహిత్య ఉద్యమంలో, తెలంగాణ ప్రాంతం రాజుల పాలన నుంచి విముక్తికి చేసిన ఉద్యమంలో ఖమ్మం జిల్లా కీలకపాత్ర పోషించిందని అన్నారు.

విద్యా, వైద్యం, వ్యవసాయం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన, సాగునీటి రంగం, పారిశ్రామిక అభివృద్ధి, అడ్వాన్స్ టెక్నాలజీ వినియోగం వంటి ప్రాధాన్యత రంగాలలో ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజా ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.

సాహిత్యం, సాంస్కృతిక ఉద్యమానికి బీజాలు వేసిన, ఆది శ్రీకృష్ణ దేవరాయ స్ఫూర్తితో వచ్చిన గ్రంథాలయ ఉద్యమం, మూడవ ఆంధ్ర మహాసభలు ఖమ్మం, మధిర ప్రాంతాలలో జరిగాయని, అల్లీ నగర్ ప్రాంతానికి చెందిన మహనీయుడు ఒట్టి కొండ రామా కోటయ్య బాల్యం నుంచి నాటి జాతీయ ఉద్యమాల స్ఫూర్తితో ప్రజా పోరాటంలో పాల్గొన్నారని తెలిపారు.

ముదిగొండ, గోకినేపల్లి, వెంకటాయపాలెం, మధిర, తెల్దారుపల్లి, ఎర్రుపాలెం, రావినూతల, గోవిందాపురం మొదలగు ప్రాంతాలు నిత్య పోరాట క్షేత్రాలుగా ఉన్నాయని, బొమ్మ కంటి సత్యనారాయణ, రావెల్ల సత్యం, రావెల్ల వెంకటరామారావు లాంటి ఎందరో మహనీయులు సాయుధ పోరాటంలో భాగం అయ్యారన్నారు. తెలంగాణ ఏర్పాటు చారిత్రక అనివార్యంగా మేధావులు భావించారని, తెలంగాణ సాహిత్య ఉద్యమానికి డాక్టర్ సి.నారాయణరెడ్డి, దాశరధి కృష్ణమాచారి వంటి ఎందరో రచయితలు తెలంగాణ రచయితల సంఘం ఏర్పాటు చేసి పట్టణాలు, గ్రామాలలో పర్యటించిన నాలుగు సంవత్సరాల పాటు ఉద్యమ స్ఫూర్తి రగిలించారని అన్నారు.

తెలంగాణ సాయుధ పోరాటంలో జరిగిన విరోచిత పోరాటాల ఫలితంగా మన ప్రాంతం రాజుల పాలన నుండి ప్రజాస్వామ్య భారతదేశంలో 1948 సెప్టెంబర్ 17న విలీనం కావడం జరిగిందని, దీనిని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించిందని డిప్యూటీ సీఎం తెలిపారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజా ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల నుంచే అమలు చేయడం ప్రారంభించిందని అన్నారు. జిల్లాలో అమలవుతున్న వివిధ పథకాలు ,ఇటీవల కురిసిన భారీవర్షాలకు వరదలతో 10 వేలమందికి పైగా నష్టపోయారని వారికీ ప్రభుత్వం సహాయం అందించామని అన్నారు ..

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డా. పి. శ్రీజ, డి. మధుసూదన్ నాయక్, శిక్షణ సహాయ కలెక్టర్ మ్రిణాల్ శ్రేష్ఠ, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ దీక్షా రైనా, డిఆర్డీవో సన్యాసయ్య, జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాజీవ్ స్వగృహ ఆస్తుల అమ్మకానికి ప్రభుత్వం పచ్చజెండా!

Ram Narayana

కాళేశ్వరం వల్లే వరిసాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది: రేవంత్ రెడ్డి

Ram Narayana

అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు …కలెక్టర్ల సమావేశంలో సీఎం రేవంత్ !

Ram Narayana