Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

దసరా కానుక పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ చేస్తున్నాం ..డిప్యూటీ సీఎం భట్టి

దసరా కానుకగా పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులను క్లియర్ చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు …ఖమ్మం వచ్చిన ఆయన కలెక్టర్ కార్యాలయంలో విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు …అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ విద్యుత్ శాఖలో ఖాళీలు భర్తీ చేసేందుకు త్వరలో భారీ నోటిఫికేషన్ ఇవ్వడంతోపాటు , చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు కూడా ఇస్తామని అన్నారు … సిబ్బంది ప్రజలకు విలువైన సేవలు అందించాలని అందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు .. విద్యుత్ శాఖలో సమస్యలు ఉంటె 1912 కు డైల్ చేస్తే సిబ్బంది స్పందిస్తారని దాన్ని ఉపయోగించుకోవాలని డిప్యూటీ సీఎం తెలిపారు ..

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలు వచ్చి విద్యుత్ సరఫరా నిలిచిపోతే సిబ్బంది రేయింబవుళ్లు శ్రమించి విద్యుత్ పునరుద్ధరించి ప్రజలకు సేవలు అందించిన సిబ్బందిని అభినందించారు .. నిజంగా విద్యుత్ అనేది జీవితంలో భాగం అయింది …ఒక్క నిమిషం లేకపోయినా ప్రజల నుంచి పిర్యాదులు వస్తున్నాయి…అలాంటి శాఖలో నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్న సిబ్బంది సేవలు మరలవలేనివన్నారు ..

దసరా సందర్బంగా ఇంటిగ్రేటెడ్ పాఠశాల ప్రారంభోత్సవానికి భూమి పూజ చేయబోతున్నట్లు చెప్పారు .. పాఠశాలల భవన నిర్మాణాలకు ప్రత్యేక డిజైన్లు తయారు చేయించడం జరిగిందని అన్నారు … ఇంటర్నేషనల్ స్థాయిలో విద్యాభోధన, క్రీడలు, వెకేషన్స్ లో పిల్లల కోసం పాఠశాలలో సినిమా ధియేటర్,ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం తో భవనాల నిర్మాణం జరుగుతుందని ఇది దేశంలో ఎక్కడ లేని విధంగా అత్యున్నత ప్రమాణాలతో ఇంటి గ్రేటెడ్ పాఠశాల లో విద్యా భోధన జరుగుతుందన్నారు …

ఎస్సీ,ఎస్టీ ,మైనారిటీ రెసిడెన్షిల్ స్య్కూల్స్ లో సంబంధించిన పెండింగ్ బిల్స్ 114 కోట్లు విడుదల చేయడం జరిగిందన్నారు ..పిల్లల కాస్మొటిక్ ఛార్జీలను ఏ నెలకు ఆ నెలే అందజేస్తామన్నారు ..పాఠశాలలకు సంబంధించిన మధ్యాహ్న భోజన పెండింగ్ బిల్లులు మొత్తం విడుదల చేయడం జరిగిందన్నారు ..

ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు పూర్తి స్థాయీలో విడుదల చేశాం… ఇక పై అందరికీ ప్రతి నెలా జీతాలు అందజేస్తామన్నారు భట్టి …ఫీజు రియంబర్స్ మెంట్,స్కాలర్ షిప్ లు పెండింగ్ లో ఉన్న వాటిని అన్నీ క్లియర్ చేస్తున్నామన్నారు .. దసరా కంటే ముందే అన్ని రకాల పెండింగ్ బిల్స్ విడుదల చేయబోతున్నట్లు తెలిపారు .. దసరాకు సంతోషకరమైన విషయం చెబుతున్నాను …రాష్ట్రం లో రైతులు ఎవరికి ట్రాన్స్ ఫార్మర్ లు, కరెంట్ పోల్స్ కావాలంటే వెంటనే ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నామని డిప్యూటీ సీఎం అన్నారు …

Related posts

 కోమటిరెడ్డి ఫోన్ నుంచి వంద సార్లు ఫోన్ చేసినా వికాస్ రాజ్ ఎత్తలేదు: రేవంత్ రెడ్డి

Ram Narayana

వనమాకు సుప్రీం లో బిగ్ రిలీఫ్ …హైకోర్టు తీర్పుపై స్టే….!

Ram Narayana

హైదరాబాద్ లో స్కూలు ముందే వైన్ షాప్.. ఎత్తేయాలంటూ స్థానికుల ఆందోళన

Ram Narayana

Leave a Comment