Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

సీఎం రేవంత్ రెడ్డి పై ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం..డిప్యూటీ సీఎం భట్టి!

రైతులకు ఎంతో మేలు చేస్తూ , 2 లక్షల రూపాయల రుణమున్న రైతులను రుణవిముక్తులుగా చేసిన సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ యస్ నేతలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమని చాటి చెప్పాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు…శనివారం విజయదశమి పర్వదినాన అశ్వారావుపేటలో ఆయిల్ ఫామ్ కర్మాగారం విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు …లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పిన గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా రైతులను మోసం చేసి సిగ్గు లేకుండా మాట్లాడటం విడ్డురంగా ఉందని అన్నారు ..రైతులను రెచ్చగొట్టి రోడ్లమీదకు తీసుకురావడాన్ని గర్హించారు ..రైతులు కూడా ఎవరు మేలు చేశారు …అనేది ఆలోచించి 15 రోజుల్లోనే 18 వేల కోట్ల రూపాయలను దేశంలో ఎక్కడ లేని విధంగా రికార్డు స్థాయిలో నేరుగా రైతుల ఖాతాల్లో వేసిన సీఎం పై అవాకులు చవాకులు పేలితే తగిన బుద్దిచెప్పాలన్నారు ..

రాజకీయాలకతీతంగా తర తమ భేదం లేకుండా అర్హత కలిగిన ప్రతి రైతు ఖాతాలో ఒకేసారి రైతు రుణమాఫీ డబ్బులు జమ చేశామన్నారు .. ఆధార్ కార్డు నెంబర్లు, రేషన్ కార్డు వివరాలు సరిగ్గా లేకుండా అర్హత ఉండి రుణమాఫీ కానటువంటి వారు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకోవచ్చునని అన్నారు ..అర్హత ఉన్న ప్రతి రైతుకు ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ 100% అమలు చేస్తామన్నారు

రైతులు చెల్లించాల్సిన పంట బీమా ప్రీమియాన్ని ప్రజా ప్రభుత్వమే రైతుల తరఫున ఇన్సూరెన్స్ కంపెనీలకు చెల్లించిందన్నారు.ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో వచ్చిన వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి క్షేత్రస్థాయిలోకి అధికారులు పంపించి పంట నష్టం అంచనా వేయించామన్నారు …

ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం రైతు పక్షపాతి కాబట్టే బడ్జెట్లో ఎన్నడు లేని విధంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ 73 వేల కోట్ల రూపాయలను కేటాయించాం …ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ ఖరీఫ్ సీజన్లో వచ్చే వరి సన్న ధాన్యానికి మద్దతు ధర ఇవ్వడంతో పాటు క్వింటాకు  500 రూపాయల బోనస్ ఇవ్వబోతున్నామన్నారు ..

దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉన్న గత బిఆర్ఎస్ పాలకులు రైతులకు ఏనాడు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు …ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోయిన రైతు సోదరులకు 10 సంవత్సరాల కాలంలో ఏనాడు పరిహారం అందివ్వలేదని ఎకరాకు 10 వేలు ఇస్తామని స్వయంగా సీఎం ప్రకటించిన దిక్కులేదని కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు ..

వచ్చే ఐదారు సంవత్సరాల్లో రాష్ట్రంలో 20వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ను ఉత్పత్తి చేయడానికి ప్రణాళికలు రూపొందించుకొని ముందుకు పోతున్నామన్నారు . ప్రకృతి వనరులతో లభించే విద్యుత్ ను ఉత్పత్తి చేసి తెలంగాణ ప్రజల అవసరాలు తీర్చడానికి న్యూ ఎనర్జీ పాలసీని తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నదన్నారు ..

రైతులకు పంటతోపాటు పవర్ తో ఆదాయం వచ్చే విధంగా సోలార్ విద్యుత్ పంపు సెట్లను రూపకల్పన చేశామన్నారు .. రాష్ట్రంలో కొన్ని గ్రామాలను సోలార్ విద్యుత్ గ్రామాలుగా మార్చడానికి పైలెట్ ప్రాజెక్టుగా ఎంపీగా చేశాం. అశ్వరావుపేట నియోజకవర్గం నుంచి రెండు గ్రామాలను ఈ ప్రాజెక్టు  కోసం ఎంపిక చేస్తామన్నారు …

రైతుల పొలాల మీదుగా వెళ్లేటువంటి విద్యుత్తు లైను షిఫ్ట్ చేసుకోవడానికి సమంత అధికారులకు దరఖాస్తు పెట్టుకుంటే వారి పర్యవేక్షణలో లైన్ షిప్ చేసుకోవచ్చన్నారు ..
ఫామ్ ఆయిల్ సాగు పంట కేవలం అశ్వరావుపేట లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి తగిన తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సూచించారు.. 1990 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హయాంలో హార్టికల్చర్ సాగులో మార్పులు తీసుకువచ్చారన్నారు .. రాష్ట్రంలో ఆయిల్ ఫామ్ సాగు చేయడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడి నుంచి మలేషియా కు ఒక బృందాన్ని పంపించిందన్నారు ..

తూర్పుగోదావరి పశ్చిమగోదావరి ఖమ్మం జిల్లాలో ఉన్న అశ్వరావుపేట లో ఆయిల్ ఫామ్ సాగుకు శ్రీకారం చుట్టారు. ఆనాటి కాంగ్రెస్ పాలకుల ముందు చూపు వల్లనే ఈరోజు రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నదని డిప్యూటీ సీఎం అన్నారు .. రైతులకు మేలు జరగాలన్న ఆశ, ఆకాంక్షతో ఏర్పాటు చేసిన ఆయిల్ ఫామ్ కర్మాగారం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం విజయవంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు .. రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ప్రతి పైసా ప్రజల కోసమే ఖర్చు చేస్తూ ప్రజల జీవితాలు వెలుగులు నింపడానికి ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నది. స్థానిక శాసన సభ్యులు జారే ఆదినారాయణ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు గురించి వివరించారు ..

Related posts

అన్నా వస్తున్నా.. అడుగులో అడుగేస్తా.. చేతిలో చెయ్యేస్తా: బండ్ల గణేశ్

Drukpadam

ఆడపిల్ల పుడితే రూ.5 వేలు ఇస్తా… సర్పంచ్ అభ్యర్థి భారీ మేనిఫెస్టో!

Ram Narayana

హైదరాబాద్ నగరం గూగుల్ మ్యాప్స్‌పై చిరంజీవి! మెగాభిమానం అంటే ఇదే!

Ram Narayana

Leave a Comment