తెలుగు రాష్ట్రాలు

నాగార్జున పరువు ఎప్పుడో పోయింది…

నాగార్జున పరువు ఎప్పుడో పోయింది: సీపీఐ నారాయణ

  • ఇటీవల అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు
  • కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేసిన నాగార్జున
  • బిగ్ బాస్ షోతో నాగార్జున పరువు ఎప్పుడో పోయిందన్న నారాయణ
  • కొండా సురేఖపై పరువు నష్టం దావా వేయడం ఓ జోక్ లా ఉందంటూ ఎద్దేవా

ఇటీవల తెలంగాణ మంత్రి కొండా సురేఖ తమ కుటుంబంపై చేసిన వ్యాఖ్యల పట్ల నటుడు నాగార్జున కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సెటైర్లు వేశారు. ఎవరైనా పరువు కలిగినోళ్లు పరువునష్టం దావా వేస్తారు కానీ… పరువులేని నాగార్జున పరువునష్టం దావా వేయడం విడ్డూరంగా ఉందంటూ వ్యాఖ్యానించారు. 

“పరువు లేనోడు పరువునష్టం దావా వేస్తాడా? బిగ్ బాస్ షోతో పరువు పోగొట్టుకున్న నాగార్జున ఇప్పుడు కొండా సురేఖపై పరువునష్టం దావా వేశాడు. సమంత లాంటి వాళ్లు పరువునష్టం దావా వేస్తే అర్థం ఉంది కానీ… బిగ్ బాస్ కార్యక్రమం ద్వారా అన్ పాప్యులర్ అయిన నాగార్జున పరువునష్టం దావా వేయడం అంటే అంతకంటే అవమానకరమైన విషయం మరొకటి ఉండదు. 

కొండా సురేఖ క్షమాపణలు కూడా చెప్పిన తర్వాత ఇక దానిపై ముందుకు వెళ్లాల్సిన అవసరం లేదు. నాగార్జున వంటి వ్యక్తి పరువునష్టం దావా వేయడం చూస్తుంటే ఓ జోక్ లా అనిపిస్తోంది” అని నారాయణ ఎద్దేవా చేశారు.

Related posts

ఆసక్తికర పరిణామం …తెలంగాణాలో టికెట్ ఆశిస్తున్నా వ్యక్తికీ ఆంధ్రాలో టికెట్

Ram Narayana

నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు హైదరాబాద్ వాసుల దుర్మరణం

Ram Narayana

చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు! హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వరకూ కార్ల ర్యాలీ

Ram Narayana