అంతర్జాతీయం

ఆస్ట్రేలియా వ‌ర్కింగ్ వీసాకు భారీ స్పంద‌న‌.. 1000 వీసాల‌కు 40వేల మంది భార‌తీయుల ద‌ర‌ఖాస్తు


అసలే విదేశీ మోజులో ఉన్న భారతీయులకు ఆస్ట్రేలియా వర్క్ పర్మిట్ వీసా ప్రకటించడంతో అది పొందేందుకు ఎగబడ్డారు …1000 మందికి వీసాలు ఇస్తున్నట్లు ఆదేశం ప్రకటించింది …దీనికి 40 వేలమంది భారతీయులు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం …

ఇటీవ‌ల ఆస్ట్రేలియా ప్ర‌క‌టించిన వ‌ర్కింగ్ హాలిడే మేక‌ర్‌ వీసా కార్య‌క్ర‌మానికి భారీ స్పంద‌న వ‌చ్చింది. ఈ కార్య‌క్ర‌మంలో అందుబాటులో ఉంచిన 1000 వీసాల‌కు రెండు వారాల్లోనే 40వేల మంది భార‌తీయులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు.

ఈ మేర‌కు ఆస్ట్రేలియా వ‌ల‌స‌ల శాఖ స‌హాయ‌మంత్రి ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు. ఇక ఈ వీసా పొందిన‌వారు ఆ దేశంలో 12 నెల‌ల పాటు స్టే చేసేందుకు వెసులుబాటు ఉంటుంది. ఆ స‌మ‌యంలో వీసాదారుల‌ను చ‌దువుకోవ‌డానికి, ఉద్యోగం చేయ‌డానికి, నివాసం ఉండ‌డానికి అనుమ‌తించ‌డం జ‌రుగుతుంది. 

వీసా ల‌భించిన వారు 2025 ప్రారంభంలో ఆస్ట్రేలియాకు వెళ్లొచ్చు. 18-30 ఏళ్ల వ‌య‌సు ఉన్న భార‌తీయులు ఈ వ‌ర్కింగ్ హాలిడే మేక‌ర్ వీసా కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

Related posts

ఇజ్రాయెల్‌ను కుదిపేస్తున్న కుంభకోణం.. మాజీ సైనిక ఉన్నతాధికారిణి అరెస్ట్!

Ram Narayana

అమెరికా సుప్రీంకోర్టుపై ట్రంప్ అసహనం!

Ram Narayana

 కాప్30 సదస్సులో అగ్నిప్రమాదం.. కీలక చర్చలకు బ్రేక్…

Ram Narayana